Begin typing your search above and press return to search.

గ్రాడ్యుయేషన్ రోజున విద్యార్థులకు సర్ ప్రైజ్ ఇచ్చిన బిలియనీర్

By:  Tupaki Desk   |   29 May 2023 10:20 AM GMT
గ్రాడ్యుయేషన్ రోజున విద్యార్థులకు సర్ ప్రైజ్ ఇచ్చిన బిలియనీర్
X
సింఫుల్ గా వ్యవహరిస్తూ సర్ ప్రైజ్ చేసే పెద్ద మనుషులు కొందరు ఉంటారు. ఇలాంటి వారు మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ప్రసంగాలు ఇవ్వటం వేరు. తాను చెప్పే నీతిని చేతల్లో చూపిస్తూ.. మాటల్లో చెప్పే తీరు చాలా తక్కువ మందిలో ఉంటుంది. తాము సంపాదించిన దానిని సమాజానికి తిరిగి ఇచ్చే విషయంలో కొంతమంది సంపన్నులు మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు.

ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు అమెరికా బిలియనీర్ రాబర్ట్హాలే. గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థను నిర్వహిస్తున్న అతను..తాజాగా బోస్టన్ లోని మాసాచూసెట్స్ వర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 2500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రోగ్రాంలో భాగంగా తొలిసారి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకు విద్యార్థులు స్టేజ్ మీదకు వెళ్లి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకొని తమ సీటు వద్దకు వచ్చి కూర్చున్న వారు.. పట్టాతో పాటు తమకు రెండు కవర్లు ఇవ్వటం.. అందులో ఒక కవరర్ మీద గిఫ్ట్ అని.. మరో కవర్ మీద 'గివ్' అని రాసి ఉండటం.. దాన్ని ఆసక్తిగా ఓపెన్ చేసిన విద్యార్థులకు.. ఒక్కో కవర్ లో 500డాలర్లు చొప్పున ఉన్న వైనంపై వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

అయితే.. విద్యార్థులందరికి వెయ్యి డాలర్లు ఇచ్చింది వర్సిటీ కాదు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వ్యాపారవేత్త రాబర్ట్ హాలే. తన ప్రసంగంలో రెండు కవర్ల గురించి.. తాను ఎందుకు వాటిని విద్యార్థులకు ఇచ్చానన్న విషయాన్ని వెల్లడించే క్రమంలో ఆసక్తికకర విషయాల్ని చెప్పుకొచ్చారు. ఎంతో కష్ట కాలాన్ని దాటుకొని వచ్చిన విద్యార్థులు.. అందుకు చాలానే కష్టపడి ఉంటారని చెప్పారు. విద్యార్థులందరి పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పిన రాబర్ట్.. ఆ ఆనందాన్ని కలిసి పంచుకుందామనే రెండు కవర్లు ఇచ్చినట్లుగా చెప్పారు.

'మీకు రెండు బహుమతులుఇచ్చాం. మొదటిది మీకు బహుమతి కాగా. రెండోది మీరు ఇతరులకు ఇవ్వటం కోసం. రేపటి సమాజానికి ప్రతీకలు మీరు. మీకు దొరికిన దాంట్లో కొంత ఇతరులకు ఇస్తే.. మీ లైఫ్ మరింత సంతోషంగా ఉంటుంది. ఓటమి గురించి బాధపడొద్దు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోండి' అంటూ ఉత్త మాటలతో ప్రసంగాన్ని దంచేయకుండా.. చేతలతో తానేమిటో చెప్పుకొచ్చారు.

ఈ ఉదంతం విద్యార్థులను విపరీతంగా ప్రభావితం చేసింది. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన 2500 మందికి వెయ్యి డాలర్ల చొప్పున బహుమతిగా ఇవ్వటం అంటే.. సామాన్యమైన విషయం కాదు. ఇక.. రాబర్ట్ వ్యక్తిగత సంపద విలువ 5 బిలియన్ డాలర్లుగా చెబుతుంటారు. ఇప్పటివరకు 280 మిలియన్ డాలర్లను క్యాన్సర్ పరిశోధనలకు.. విద్యా సంస్థలతో పాటు వివిధ దాత్రత్వ కార్యక్రమాలకు ఇచ్చిన ట్రాక్ రికార్డు అతని సొంతం. అంటే.. ఇప్పుడున్న తన సంపదలో.. ఇప్పటికే సగం మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేసిన వైనం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం.