విడిపోయినా కరోనా కట్టడికి కదిలిన బిల్ గేట్స్ దంపతులు

Wed Jan 19 2022 11:34:33 GMT+0530 (IST)

Bill Gates couple Reunited

దంపతులుగా విడిపోయినా కూడా తమ సేవా గుణాన్ని వీడడం లేదు బిల్ గేట్స్ దంపతులు.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా పోరుకు భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు బిల్ గేట్స్ ఆయన భార్య మిలిండా గేట్స్ 150 మిలియన్ డాలర్లను అందించారు.గేట్స్ ఫౌండేషన్ బ్రిటీష్ బయోమెడికల్ చారిటీ వెల్ కమ్ సంస్థలు చెరో 150 మిలియన్ డాలర్లు మొత్తం 300 మి. డాలర్లు అందించాయి.

ఈ మొత్తం ఐదేళ్ల క్రితం స్థాపించిన కొల్లినేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపెడ్ నెస్ ఇన్నోవేషన్ (సీఈపీఐ)కి వెళుతాయి. ఈ సంస్థకు కోవాక్స్ సహా నేతృత్వం వహిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ కూటమి తోపాటు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంలో ఈ సంస్థ చొరవ చూపిస్తుంది.

ఒమిక్రాన్ చివరి వేరియంట్ అవుతుందని ఎవ్వరూ విశ్వసించరని వెల్ కమ్ డైరెక్టర్.. బ్రిటీష్ శాస్త్రవేత్త జెరెమీ ఫర్రార్ తెలిపారు. మాకు ప్రపంచ స్పందన అవసరమని.. ప్రభుత్వాలు తమ సహకారాన్ని పెంచాలని ఆయన కోరారు.

బిల్ గేట్స్ జంట విడిపోకముందు చాలా సహాయాలు చేశారు. మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచావ్యాప్తంగా కోట్ల డాలర్లు విరాళాలు చేసి సహాయం అందించారు.