Begin typing your search above and press return to search.

బీచ్ వాలీబాల్‌ లో బికినీ మస్ట్.. మహిళా అథ్లెట్లు ఆగ్రహం !

By:  Tupaki Desk   |   29 July 2021 12:30 PM GMT
బీచ్ వాలీబాల్‌ లో బికినీ మస్ట్.. మహిళా అథ్లెట్లు ఆగ్రహం !
X
టోక్యో ఒలింపిక్స్ గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన విశ్వ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో అథ్లెట్లతో పాటు క్రీడాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. టోర్నమెంట్‌లో ప్రస్తుతం మొదటి వారం నడుస్తోంది. అనేక క్రీడలలో పతకాల పోటీలు జరిగాయి. ఇంకా చాలా వరకు జరుగుతున్నాయి. మరికొన్ని క్రీడల్లో లీగ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఒలింపిక్స్‌ లో కొన్ని ఆటలలో మహిళా అథ్లెట్ల దుస్తుపై తీవ్రమైన చర్చ నడుస్తోంది.

అందులో ముఖ్యమైనది బీచ్ వాలీబాల్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలలో, మహిళా క్రీడాకారులు తరచుగా బికినీలు లేదా మోనోకినిలు ధరించే ఈ ఈవెంట్లలో పాల్గొంటారు. ఈ ఆటలలో మహిళా అథ్లెట్లను లైంగిక వస్తువులుగా చూపిస్తున్నారనే ఆరోపణలకు ఇవి దారితీసింది. పొట్టి దుస్తులు ధరించాలనే బలవంతం కారణంగా, ఆటగాళ్లు తరచుగా దోపిడీకి గురవుతున్నారు. అయితే ఇలాంటి పటీల్లో పురుషులుపూర్తిగా కప్పబడిన దుస్తులను ధరిస్తారు. ఇటీవల, జర్మన్ మహిళా జిమ్నాస్ట్‌ లు ఫొట్టి దుస్తులకు బదులుగా పూర్తిగా కప్పి ఉంచే వాటినే ధరించాలని నిర్ణయించుకున్నారు.

అలాగే నార్వే మహిళల బీచ్ వాలీబాల్ జట్టు కూడా బికినీకి బదులుగా షార్ట్స్ ధరించాలని నిర్ణయించింది. అయితే, ఇలాంటి నిర్ణయం వల్ల వారు జరిమానా కూడా చెల్లించాల్సి వచ్చింది. బీచ్ వాలీబాల్‌లో తప్పని సరిగా బికినీలు ధరించాల్సి ఉంటుంది. 7 సెంటీమీటర్లకు మించని పరిమాణంలో బికినీ ఉండాలి. అలాగే నచ్చిన రంగులో బికినీలు ధరించవచ్చు. కానీ ఇరు జట్లు ఒకే రంగు ఇష్టపడితే మాత్రం టాస్ వేసి రంగు డిసైడ్ చేస్తారు. ఇది ఒలంపిక్ గేమ్స్ రూల్. టోక్యో ఒలింపిక్ క్రీడలకు ముందు, నార్వే మహిళల బీచ్ వాలీబాల్ జట్టు యూరోపియన్ హ్యాండ్‌బాల్ సమాఖ్యను బికినీలకు బదులుగా షార్ట్స్ ధరించేందుకు అనుమతి కోరింది. బికినీలతో ఈ ఆటల్లో పాల్గొనడం వల్ల లైంగికంగా వేధింపులకు గురయ్యారని పేర్కొన్నారు. అయితే అందుకు సమాఖ్య నిరాకరించింది.

షార్ట్‌ లను ధరిస్తే జరిమానా కట్టాల్సివస్తుందని హెచ్చరించింది. సమాఖ్య తీర్పును నార్వే జట్టు వ్యతిరేకించింది. షార్ట్స్ ధరించి గేమ్‌ లో పాలొంది. అలాగే టోక్యో గేమ్స్ ప్రసారం చేసే ఛానల్స్‌ కు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. మహిళా అథ్లెట్ల అసభ్యకర చిత్రాలను హైలైట్ చేయవద్దని ఒలింపిక్ సమాఖ్య కోరింది. టోక్యో ఒలింపిక్స్‌ లోనే, జర్మన్ మహిళా జిమ్నాస్ట్‌లు పూర్తిగా కప్పబడిన దుస్తులు ధరించాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఈ క్రీడలో మహిళా అథ్లెట్లు మోనోకిని లేదా సాంప్రదాయ బికినీ ధరిస్తారు. వాటి పొడవు చాలా తక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో, జిమ్నాస్టిక్స్ మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపుల కేసులు చాలా పెరిగాయి. దాంతో దుస్తులు మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఒలింపిక్స్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడలలో బీచ్ వాలీబాల్ ఒకటి. ఈ క్రీడలు 1996 నుంచి ఒలింపిక్స్‌లో ఉన్నాయి. ఈ ఆటలలో అమెరికా 12 స్వర్ణాలలో ఆరు గెలిచింది. 2012 ఒలింపిక్ క్రీడలకు ముందు, సమగ్ర దుస్తుల నియమాలు లేవు. కానీ, అనంతరం ఒలింపిక్ కమిటీ వీటిని మార్చింది. ఆటగాళ్లు షార్ట్స్, ప్యాంట్ లేదా ఫుల్ స్లీవ్ టాప్స్ ధరించవచ్చని కోరింది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా అనేక బ్రిటిష్ వార్తాపత్రికలు బీచ్ వాలీబాల్ క్రీడాకారుల బికినీల ఫొటోలను ముద్రించాయి.టోక్యో ఒలింపిక్ క్రీడల మధ్యలో బీచ్ వాలీబాల్ అసోసియేషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, మహిళా అథ్లెట్లు పొడవైన ప్యాంటు, షార్ట్స్ ధరించవచ్చు. అలాగే మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని, తదనుగుణంగా బట్టలు ఎంచుకోవడానికి కూడా అవకాశం ఉంది.