Begin typing your search above and press return to search.

రేప్ కేసు: ఊరిలోని మహిళలందరి బట్టలూ ఉతకాలని కోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:32 AM GMT
రేప్ కేసు: ఊరిలోని మహిళలందరి బట్టలూ ఉతకాలని కోర్టు ఆదేశం
X
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు విశృంఖలంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా లైంగిక దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. ఈ క్రమంలోనే బీహార్ కోర్టు ఓ రేప్ కేసు నిందితుడికి వింతైన శిక్ష విధించింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం విచిత్రమైన శిక్షను విధించింది. ఊరిలోని మహిళలందరి దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. వేధింపులకు గురిచేసినందుకు పశ్చాత్తాపంగా అందరి బట్టలు ఉచితంగా ఉతకాలని.. నిందితుడి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా బీహార్ మధుబని కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది.

మధుబని జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు.. రజక వృత్తి చేసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో అతడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ కోసం నిందితుడి తరుఫున లాయర్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. రేప్ చేసిన యువకుడి వయసు 20 ఏళ్లు అని.. రజకవృత్తిలో ఉండి సమాజానికి సేవ చేస్తున్నాడని లార్ తెలిపారు. దాదాపు 6 నెలలుగా జైల్లో ఉన్నాడని వివరించారు. అంతేకాదు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ రాజీకి సిద్ధంగా ఉందని.. ఈ విషయాన్ని అఫిడవిట్ లో పొందుపరిచామని పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న కోర్టు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళలందరి దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని నిందితుడికి కోర్టు హెచ్చరించింది.