Begin typing your search above and press return to search.

బొక్క బోర్లా పడ్డ అమెరికా అధ్యక్షుడు

By:  Tupaki Desk   |   2 Jun 2023 11:01 AM GMT
బొక్క బోర్లా పడ్డ అమెరికా అధ్యక్షుడు
X
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఆయన ఒక్కసారిగా బొక్క బోర్లా పడ్డారు. అదేంటి అమెరికా అధ్యక్షుడు పడిపోవడం ఏంటి అనుకుంటున్నారా... అసలు ఏం జరిగిందంటే... ఒక కార్యక్రమం లో ఆయన స్టేజీ పై నిల్చున్నారు. అయితే ఆయన పక్కకు కదులుతున్న క్రమంలో ఒక్కసారిగా బొక్క బోర్లా పడిపోయారు.

అయితే ఈ ఘటన కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం గ్రాడ్యుయేషన్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుక కు అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేట్లకు పట్టాలు అందజేస్తున్న క్రమంలో బైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు.

వెంటనే అప్రమత్త మైన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. ఇది చూసిన అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడే ఉన్న ఆయన వ్యక్తి గత సిబ్బంది ఆయన ను పైకి లేపారు. ఆ తర్వాత ఆయనే లేచి తన సీటు వద్ద కూర్చున్నారు. అది వీడియో లో చూడొచ్చు. ఆయనకేమీ కాలేదని, బాగానే ఉన్నారని ఈ ఘటన జరిగిన కొద్ది సమయం తర్వాత అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ ఓ ప్రకటనలో వివరించింది. ఆ ఘటన ను బైడెన్ సరదాగా తీసుకున్నారని వెల్లడించింది.

అయితే ఈ ఘటన పై జో బైడెన్ నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు. పడిపోయిన వెంటనే తనకు ఏదో తగిలిందని, తాను అందులో పడిపయినట్లు నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఇక సాయంత్రం వైట్ హౌస్‌ కి తిరిగి వచ్చినప్పుడు జాగింగ్ చేస్తున్నట్లు నటించి, పడిపోయిన ఘటన కు సంబంధించిన అవమానాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇంతకు ముందు కూడా కొన్ని కార్యక్రమాల్లో చాలా సార్లు పడిపోయారు. ఇటీవల విదేశీ పర్యటకు వెళ్లిన బైడెన్‌ తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఎక్కుతూ మెట్ల పై జారిపడ్డ విషయం తెలిసిందే. ఇదే కాదు... చాలా సందర్భాల్లో అధ్యక్షుడు జో బైడెన్ కింద పడి వార్తల్లోకి ఎక్కారు. మొత్తానికి జో బైడెన్ బొక్క బోర్లా పడిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారింది. ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి.