ప్రపంచవ్యాప్తంగా అక్కడి ఉల్లిపాయకు గుర్తింపు..: ఎందుకంటే.?

Wed Jul 06 2022 16:18:52 GMT+0530 (IST)

Benifits of Onion From That Place

ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు.. ఎందుకంటే మన కంటి నుంచి తల్లులు తెప్పించని నీళ్లు  ఉల్లిపాయ తరిగేటప్పుడు అనుకోకుండానే వస్తాయి. ఒక మనిషి ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంతో సహకరిస్తుంది. ఉల్లిపాయను కేవలం కర్రీలోనే కాకుండా నేరుగా కూడా కొన్ని ఆహార పదార్థాలతో తీసుకోవడం ఎంతో రుచిగా ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చే స్మెల్ ద్వారా చాలా మంది దానిని అవైడ్ చేస్తారు. అయితే దేశంలోని ఆ ప్రాంతంలో పండే ఉల్లిపాయకు ఇప్పుడు భౌగోలికంగా గుర్తింపు రాబోతుంది. ఈ ఉల్లికి కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ చాలా మందికి ఉపయోగమని కొందరు శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ఉల్లిపాయకు భౌగోలిక గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఆ ఉల్లిపాయను భౌగోలికంగా గుర్తింపు తీసుకావాల్సిన అవసరం ఏముంది..? అది ఎక్కడ పండుతుంది..? ప్రపంచంలోని మొగాళ్లకు ఏ విషయంలో అది మేలు చేస్తుంది..?  భారత్  నుంచి ఇప్పటి వరకు డార్జిలింగ్ టీ పోచంపల్లి ఇకత్ మైసూర్ సిల్క్స్ కొండపల్లి బొమ్మలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నిర్మల్ బొమ్మలు బికనీర్ భఉజియా గుంటూరు సన్మ్ చిల్లి హైదరాబాద్ హలీమ్ లాంటి వంట సామాగ్రిగికి భౌగోలిక గుర్తింపు వచ్చింది. వీటిలో కొన్ని రుచిని ఇవ్వడంతో పాటు మరికొన్ని ఆకర్షణీయంగా ఉన్నందును ప్రపంచవ్యాప్తంగా వీటిని ఆదరించారు. అయితే ఇప్పడు ఆ వంతు ఉల్లిపాయదైంది. ప్రపంచంలోని కొందరు డాక్టర్లు ఉల్లిపాయను తప్పనిసరిగా వాడాలని అంటున్నారట. అందులో ఉండే ఔషధ గుణాలను తెలుపుతున్నారట. దీంతో భారత్ లో పండే ఉల్లికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.

దేశంలో ప్రధానంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిపాయలను ఎక్కువగా పండిస్తారు. అయితే తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో ఎక్కువ శాతం ఉల్లి పండుతుంది. పెరంబూర్ లో 20 వేల ఎకరాల్లో ఈ పంటను వేస్తారు. ఇందులో వెట్టికులం ప్రధానమైనది. ఇక్కడ పండే ఉల్లికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ఉల్లిపాయ సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుందని కొందరు అంటున్నారు.

చెట్టికులం ఉల్లిపాయ దిగుబడి ఎక్కవగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు ఈ ఉల్లి నిల్వ ఉంటుంది. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా నాణ్యతగానే ఉండడం దీని స్పెషల్. ప్రతి ఉల్లిపాయకు 15 నుంచి 18 వకు పొరలు ఉంటాయి. దీంతో ఇవి 8 నుంచి 9 నెలల పాటు పాడైపోకుండా ఉంటాయి. ఇక తెగుళ్లు ఇతర వ్యాధుల నుంచి ఇది తట్టుకుంటుంది.  దీంతో దేశవ్యాప్తంగా చెట్టికులం ఉల్లిపాయకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రాంతంలో ఉల్లిపాయకు అనుకూలంగా నేల ఉండడంతో నాణ్యమైన పంట వస్తుంది. అలాగే ఘాటైన రుచి కూడా ఉండడంతో వీటి కోసం ఎగబడుతారు.

ఇక ఈ ఉల్లిపాయతో మరో ప్రయోజనం ఉందని అంటున్నారు. బ్లడ్ ప్రెషర్ ను బాగా తగ్గిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అలాగే మొగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఇది చాలా ఉపకరిస్తుందని తెలుపుతున్నారు. పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచడానికి ఈ ఉల్లిపాయ ఎంతో ఉపయోగకరమని అంటున్నారు.

ఇలా అనేక ప్రయోజనాలున్న సాంబార్ ఉల్లిపాయలకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కోసం దరఖాస్తు చేశారు. పెరంబలూరులోని రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు వెట్టికులం చిన్న ఉల్లి రైతుల సంఘం సంయుక్తంగా జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేశారు. మద్రాసు హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది పి. సంజయ్ గాంధీ తమిళనాడులోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన ఆఫ్ ప్రొడక్ట్స్ నోడల్ ఆఫీసర్ కు దరఖాస్తు చేశారు.