Begin typing your search above and press return to search.

పెళ్లి కూతురుకు కండోమ్స్ గిఫ్ట్

By:  Tupaki Desk   |   30 May 2023 8:27 PM GMT
పెళ్లి కూతురుకు కండోమ్స్ గిఫ్ట్
X
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాహ యోజన పథకం మరోసారి వివాదాస్పదమైంది. కొత్త జంటలకు ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లను తెరిచి చూడగా అందులో కండోమ్‌ ప్యాకెట్లు, గర్భనిరోధక మాత్రలు కనిపించాయి. దీంతో వధూవరులు కంగు తిన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కన్యావివాహం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఝబువా జిల్లాలో ప్రభుత్వం సామూహిక వివాహాలు జరిపించింది. 296 జంటలు వివాహం చేసుకున్నాయి. వీరందరికీ ప్రభుత్వం తరపున వెడ్డింగ్‌ కిట్లను అందజేశారు. వధువుల కోసం ఇచ్చిన మేకప్‌ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు ఉంచారు. దీంతో సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై సీనియర్‌ ప్రభుత్వ అధికారి రావత్‌ స్పందించారు. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు ఈ పని చేసి ఉంటారని అన్నారు. 'కన్యా వివాహ యోజన పథకం కింద మేము లబ్దిదారులకు రూ.49 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. వివాహానికి ఆహారం, నీరు, టెంట్‌ అందిస్తాం. దీని విలువ మరో రూ.6 వేలు. ఇక వారికి పంపిణీ చేసిన కిట్ల సంగతి నాకు తెలియదు' అని చెప్పారు.

గత నెలలో దిండోరిలోని గడ్సరాయ్‌ ప్రాంతంలో జరిగిన ఓ సామూహిక వివాహాల తంతు ఇలాగే వివాదాస్పదమైంది. కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకునేలా అధికారులు ప్రోత్సహించారు. దీజంతో ఈ పథకంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు మాటలు విని ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు పాజిటివ్‌ రావడం గమనార్హం. అయితే వధూవరుల వయస్సు నిర్దారించడానికి సాధారణంగా కొన్ని ఆరోగ్య పరీక్షలు అవసరమవుతాయని మెడికల్‌ చెప్పారు. ఏదేమైనా మధ్యప్రదేశ్‌ సర్కార్‌ అమలు చేస్తున్న కన్యా వివాహ యోజన వివాదాల పాలవుతోంది.