Begin typing your search above and press return to search.

ఆ ఆలయం ఏమైనా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉందా ? : బండి సంజయ్

By:  Tupaki Desk   |   21 Nov 2020 4:50 PM GMT
ఆ ఆలయం ఏమైనా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉందా ? : బండి సంజయ్
X
గ్రేటర్ పోరు లో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉండటం తో కీలక నేతలందరూ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి దిగారు. ఈ సమయంలోనే ఒకరి పై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ .. బీజేపీని చూసి టీఆర్ ఎస్ భయపడుతోందని అన్నారు. హైదరాబాద్ కి భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి టెంపుల్ పేరు మీద , అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు.. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉందా అని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా ఏ గుడికి రమ్మంటారో చెప్పండి అని అన్నారు.

సీఎం భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి రాకుంటే మక్కా మసీదు కన్నా వస్తాడు అనుకున్న ఎటు కాకుండా అయ్యాడని అయన ఎద్దేవా చేసారు. వరద సాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఎలాంటి లేఖ రాలేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. టీఆర్ ఎస్ నాపై అసత్య ప్రచారాలు చేస్తోంది అన్నారు. మేము ఆ లేఖ పై ఫిర్యాదు చేస్తే ఇంత వరకు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లడుతున్నాడన్న ఆయన జీహెచ్ ఎం సీ లో గెలిస్తే 25 వేలు వరద సహాయం చేస్తామని , ఇప్పటికే 10 వేలు సాయం పొందినవారికి మిగిలిన మొత్తాన్ని అందజేస్తామని అన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు దేశ ద్రోహం కాదా, చైనా కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. మమ్మల్ని కంట్రోల్ చేసే శక్తి మీకు లేదు. ప్రజల కంట్రోల్ లో పనిచేస్తామని అన్నారు. మేము హిందువుల గురించి మాట్లాడుతమన్న ఆయన హైదరాబాద్ లో ఎంత మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారో స్పష్టం చేయాలి... వాళ్ళను ఇక్కడి నుండి ఎందుకు పంపించడం లేదు అని ప్రశ్నించారు.

పేదలకు అందాల్సిన రైతుబంధును పొందుతోన్న కేసీఆర్, కేటీఆర్ ‌లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతాం. ఓట్లు కోసమే 40 వేల మంది రోహింగ్యాలను టీఆర్ ఎస్ కాపాడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నారు’ అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ లేఖ రాయడం వల్లే వరద సాయం నిలిపివేసినట్లు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి.