Begin typing your search above and press return to search.

టీడీపీ స్టార్ కాంపెయినర్ గా బాలయ్య అన్ స్టాపబుల్

By:  Tupaki Desk   |   30 March 2023 6:00 AM GMT
టీడీపీ స్టార్ కాంపెయినర్ గా బాలయ్య అన్ స్టాపబుల్
X
నందమూరి బాలక్రిష్ణ జాతకం ఇపుడు బ్రహ్మాండంగా ఉంది. ఆ విహయం చెప్పడానికి ఏ జ్యోతిష్కుడూ అవసరం లేదు. బాలయ్య ఊపు హుషార్ చూస్తేనే చెప్పేయవచ్చు. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ సూపర్ హిట్లు. ఓటీటీలో ఆయన షోస్ బంపర్ హిట్. యాడ్స్ లో సైతం బాలయ్య ఇరగదీస్తున్నారు, ఇపుడు క్రికెట్ కామెంటర్ గా కొత్త అవతారం.

బాలయ్య బహుముఖ ప్రతిభతో తన ఫ్యాన్ బేస్ ని అమాంతం పెంచేసుకున్నారు. ముఖ్యంగా యూత్ ని ఆయన అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 42వ పార్టీ ఆవిర్భావ సభలో స్పెషల్ అట్రాక్షన్ గా బాలయ్యే నిలిచారు. బాలయ్య మైక్ అందుకుని స్పీచ్ మొదలెట్టగానే ఈలలు గోలలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దద్దరిల్లాయి. బాలయ్య సైతం తనకు ఉన్న సాహిత్య పాండిత్యంతో ప్రాసలు సమాసాలు చెబుతూ ఉర్రూతలూగించారు.

బాలయ్య ఎన్టీయార్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం సీఎం అయిన ఎన్టీయార్ ఉమ్మడి ఏపీకి ఏమి చేశారు అన్న దాని మీద బాలయ్య ఒక్కోటీ వివరిస్తూంటే జనాలు ఆసక్తిగా విన్నారు. చాలా చోట్ల బాలయ్య ప్రసంగానికి చప్పట్లు కూడా వచ్చాయి.సినీ రంగంలో ఎన్టీయార్ చేసిన పాత్రలు ఏంటి అన్నది మొదలెట్టి అయన రాజకీయం ఏలా సాగింది, తెలుగు జాతికి ఎన్టీయార్ ఏ విధంగా ఆరాధ్య దైవంగా మారారు అన్నది బాలయ్య బహు చక్కగా వివరించారు.

దాంతో ఆవిర్భావ సభకు కొత్త హుషార్ ని తెచ్చారు. బాలయ్య గతంలో స్పీచ్ కి వస్తే సెటైర్లు కామెంట్స్ పడేవి. అధినాయకత్వం కూడా ఆయన స్పీచ్ కి కొంత ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయని అంటారు. కానీ ఇపుడు చూస్తే సీన్ మొత్తం మారిపోయింది. బాలయ్య పడికట్టు పదాలను పక్కన పెట్టి యూత్ ని పట్టుకునే కొత్త ఒరవడితో స్పీచ్ ఇస్తున్నారు దాంతో ఆయన ప్రసంగాలకు జనాలు ఫిదా అవుతున్నారు.

బహుశా అన్ స్టాపబుల్ నుంచి బాలయ్య స్పీచ్ లలో వచ్చిన మార్పుగా దీనిని అంతా భావిస్తున్నారు. బాలయ్య ఇపుడు టీడీపీకి కలసివచ్చే స్టార్ కాంపెనియర్ గా మారబోతున్నారు అంటున్నారు. ఎటూ వచ్చే ఎన్నికల్లో బాలయ్య సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్న చంద్రబాబు సైతం పెరిగిన బాలయ్య ఇమేజ్ ని గమనిస్తున్నారు. బాలయ్యకు ప్రత్యేకించి రాయలసీమ రీజియన్ బాధ్యతలు అప్పగిస్తారని అంటునారు

దాంతో ఈసారి ఎన్నికల వేళ పదునైన మాటలతో వైసీపీ మీదకు బాలయ్య జెట్ స్పీడ్ తో దూసుకు వచ్చేయడం ఖాయమని అంటున్నారు. బాలయ్య టీడీపీని వచ్చే ఎన్నికల్ల్లో గెలిపించేందుకు కీలకమైన నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.