Begin typing your search above and press return to search.

పవన్ తరువాత బాలయ్య కూడా...?

By:  Tupaki Desk   |   6 Jun 2023 7:16 PM GMT
పవన్ తరువాత బాలయ్య కూడా...?
X
చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఒక లెవెల్ లో ఉంటున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ తో పాదయాత్ర చేయిస్తూ తాను జిల్లాల ను చుట్టేస్తూ ఏపీ రాజకీయాన్ని ఓడిసిపడుతున్న బాబు కు నమ్మకమైన మిత్రుడు పవన్ దొరికారు. పవన్ ఈ నెల 14 నుంచి వారాహి రధమేసుకు ని జగన్ సర్కార్ మీద తూటాలే పేల్చనున్నారు.

దాంతో అలా వచ్చిన ప్రజా వ్యతిరేకత ను పూర్తి స్థాయి లో సొమ్ము చేసుకోవాల ని టీడీపీ చూస్తోంది. ఈ ముగ్గురూ కాకుండా మరో స్టార్ కాంపెయినర్ ని సైతం చంద్రబాబు రంగం లోకి దించబోతున్నారు. నందమూరి బాలక్రిష్ణ చేతి లో ఉన్న సినిమాలు అన్నీ ఈ డిసెంబర్ నాటి కి పూర్తి చేసుకుని ఏపీ లో ఎన్నికల ప్రచారాని కి సిద్ధమవుతారు అన్నది లేటెస్ట్ టాక్.

బాలయ్య కు రాయలసీమ లో పెద్ద ఎత్తున అభిమాన జనం ఉన్నారు. ఆయన సినిమాలు కూడా అక్కడ రికార్డుల ను బద్ధలు కొడుతూ వచ్చాయి. దాంతో వైసీపీ కి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమ ను బద్దలు కొట్టాలంటే బాలయ్యని రంగం లోకి దించాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. బాలయ్య సైతం ఈసారి హిందూపురాని కే పరిమితం కాకుడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ లో టీడీపీ ని అధికారం లోకి తీసుకుని రావాలని చూస్తున్నారు.

హిందూపురంలో హ్యాట్రిక్ విజయం మీద ఆయన కు నమ్మకం ఉందిట. దాంతో ఆయన రాయలసీమ నాలుగు జిల్లాల లోనూ పెద్ద ఎత్తున పర్యటించనున్నారని తెలుస్తోంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోలు చేస్తున్నారు. బాలయ్య ఎలా టూర్ చేస్తారు అన్నది ఇప్పటి కి అయితే తెలియడంలేదు.

ఆయన కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగా ఒక వాహనాన్ని తన రధంగా చేసుకుని రాయలసీమ నలు చెరగులా సుడి గాలి పర్యటన చేస్తారు అని అంటున్నారు. అంతే కాదు తనదైన డైలాగు లతో వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తూ టీడీపీ ని గెలిపించేందుకు కృషి చేస్తారు అని అంటున్నారు.

గతం తో పోల్చితే వైసీపీకి ఈసారి రాయలసీమ లో కొన్ని సీట్లు అయినా తగ్గుతాయని అంటున్నారు. 2019 ఎన్నికల్లో 52 సీట్లకు గానూ 49 సీట్ల ను వైసీపీ గెలుచుకుంది. బొత్తిగా మూడంటే మూడు సీట్లు టీడీపీ కి వచ్చాయి. ఇపుడు మాత్రం అంత దారుణంగా టీడీపీ పరిస్థితి ఉండదు అంటున్నారు. ముఖ్యంగా అనంతపురం లో మార్పు వస్తుందని అంటున్నారు.

అలాగే కర్నూల్, చిత్తూరుల లో కూడా కొన్ని సీట్లు గెలుచుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. దాంతో ఈ సీట్ల సంఖ్యను భారీ గా పెంచాలన్నదే బాలయ్యకు ఇచ్చిన టార్గెట్ అంటున్నారు. సీమ లో ఎంత ఎక్కువగా టీడీపీ కి సీట్లు పెరిగితే అంత అధికారానికి దగ్గరగా టీడీపీ చేరుకుంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయట.