Begin typing your search above and press return to search.
కేసీఆర్ నోట.. వృద్ధాప్యపు మాట.. ఆశ్చర్యంలో బీఆర్ ఎస్ నేతలు!
By: Tupaki Desk | 3 Jun 2023 9:31 AMతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. ఆయన నోటి వెంట మాటల తూటాలు దూసుకువస్తాయి. ఆయన ఏ విషయాన్ని స్పృశించినా.. దానిలో లోతుల్లోకి వెళ్లి.. నిశితంగా వివరిస్తారు. ఇక, ప్రతిపక్షాలను.. ప్రధాని మోడీని విమర్శించడం లో ఆయనకు ట్రాక్ రికార్డే ఉంది. అయితే.. అనూహ్యంగా సీఎం కేసీఆర్ నోట.. 'వృద్ధాప్యపు మాటలు' వచ్చాయి.
ఈ వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దశాబ్ది వేడుకలను ప్రారంభించారు. 21 రోజులు ఈ వేడుకలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ''సత్తువ ఉన్నంత వరకు సేవ చేస్తా'' అని వ్యాఖ్యానించారు. సత్తువ అంటే.. ఓపికని.. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు గుప్పించాయి. వచ్చే ఎన్నికలకు మరో ఐదు మాసాలే గడువు ఉండడంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిశితంగా ఆయనను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ''తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశాను. సత్తువ ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేనేమీ పైనుంచి దిగిరాలేదు. మీలాగే ఉన్నాను. మీతోనే ఉన్నాను. సత్తువ ఉన్నంత వరకు మీకు సేవ చేస్తా'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు రాజకీయంగా తమకు అనుకూల వాతావరణం సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీఆర్ ఎస్ నాయకులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమైందని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి.. రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయని వివరించారు. కొత్త చట్టంతో స్థానిక సంస్థల్లో అద్భుత మార్పు వచ్చిందన్న కేసీఆర్.. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో మనది దేశంలోనే టాప్ ర్యాంక్ అని గుర్తు చేశారు.
ఇటీవల మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రానికి 23 అవార్డులు వచ్చినట్లు గుర్తు చేశారు. సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన కేసీఆర్.. అనంతరం బీఆర్‌ఎస్ సర్కార్ ప్రగతి ప్రస్థానాన్ని సవివరంగా వివరించారు.