Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు బీజేపీ ఫీవ‌ర్‌.. సెంటిమెంటు గోలీలు ప‌నిచేస్తాయా?

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:30 AM GMT
కేసీఆర్‌కు బీజేపీ ఫీవ‌ర్‌.. సెంటిమెంటు గోలీలు ప‌నిచేస్తాయా?
X
రాజ‌కీయాల్లో సెంటిమెంటు అవ‌స‌ర‌మే.. కానీ.. అప్పుడే ఎందుకు? అనేది ఇప్పుడు తెలంగాణలో చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉంది. కానీ.. ఇప్పుడే.. సీఎం కేసీఆర్ "మ‌న తెలంగాణ‌.. మ‌న పాల‌న‌.. మ‌న నీళ్లు.. మ‌న క‌రెంటు" అంటూ.. సెంటిమెంటు అస్త్రాలు సంధిస్తున్నారు. దీనిని గ‌మ‌నిస్తున్న మేధావులు చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కేసీఆర్‌కు బీజేపీ ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌ని అంటున్నారు. అందుకే ఆయ‌న సెంటెమెంటు గోలీలు వేస్తున్నార‌ని.. ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు.. త‌న పాల‌న ప్రారంభ‌మై.. ఏడు సంవ‌త్స‌రాలు అయిపోయింది.

ఈ ఏడు సంవ‌త్స‌రాల్లో బంగారు తెలంగాణ‌ను సాధించి ఉంటే.. ఈ సెంటిమెంటును మ‌రోసారి తెర‌పైకి తెచ్చే ప‌నిలేకుండా.. చేసిన ప‌నిని చెప్పుకొనే వార‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం మునుగోడు ఉప ఎన్నిక ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో బీజేపీ పావులు క‌దుపుతున్న తీరు కేసీఆర్‌కు స‌హ‌జంగానే.. కంటిపై నిద్ర క‌రువ‌య్యేలా చేస్తోంద‌ని.. కొన్నాళ్లుగా విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. కేంద్రంలో బ‌లంగా ఉండ‌డం.. అడుగులు వేగంగా ప‌డుతుండ‌డం.. ఒక నియోజ‌క‌వ‌ర్గం త‌ర్వాత‌.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేస్తుండ‌డం.. కేసీఆర్‌కు ఇబ్బందిగానే ప‌రిణ‌మిస్తున్నాయ‌ని అంటున్నారు.

అంతేకాదు.. పార్టీ ఏదైనా బ‌ల‌మైన నాయ‌కులు క‌మ‌లం గూటికి చేరుతుండ‌డం.. వంటివి స‌హ‌జంగానే అధికార పార్టీలో క‌ల‌వ‌రం రేపుతున్నాయి. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఏ పార్టీని బ‌ల‌ప‌డ‌కుండా.. చూడడంలో కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగారు. 2014, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కాంగ్రెస్ ను బ‌ల‌హీన ప‌రిచే క్ర‌మంలో అనేక మంది నాయ‌కుల‌ను ఆ య‌న పార్టీలోకి తీసుకు న్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ బ‌ల‌ప‌డ‌కుండా.. ఆపార్టీ త‌ర‌ఫున గెలిచిన వారికి కూడా గేలం వేశారు. అయితే.. నిన్న మొన్న‌టి హుజూరాబాద్ ఉప ఎన్నిక వ‌ర‌కు కూడా బీజేపీని అస‌లు ఖాత‌రు చేయ‌లేదు.

అయితే.. ఆ ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత‌.. జ‌రుగుతున్న‌ప‌రిణాలు.. బీజేపీ వ్యూహాత్మ‌కంగా క‌దుపుతున్న పావులు.. పాద‌యాత్ర లు.. మాట‌ల తూటాలు.. ప్రెస్ మీటింగులు.. బీజేపీ అగ్ర‌నేతల రాక పోక‌లు.. ప్ర‌జ‌ల‌కు సందేశాలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగా వేయాల‌నే కాషాయ పార్టీ ల‌క్ష్యాలు..

వంటివి కేసీఆర్‌కు ఇబ్బందిక‌రంగా మారాయ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం కోసం.. ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

స‌ర్వే రిపోర్టుల్లో ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని.. పైకి చెబుతున్నా.. అధినేత‌పైనా.. ఏమంత సానుకూలత ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌డం లేదు. దీంతోనే మ‌రోమారు.. కేసీఆర్ "మ‌న‌.. మ‌న‌.. మ‌న‌" అంటూ.. తెలంగాణ స‌మాజాన్ని.. మ‌రోసారి సెంటిమెంటు బాట ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చ ఏస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.