Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రియాలిటీ ఏంటి? తెలంగాణలో బీజేపీ ముందస్తు ప్లాన్

By:  Tupaki Desk   |   25 Jan 2023 6:00 AM GMT
గ్రౌండ్ రియాలిటీ ఏంటి? తెలంగాణలో బీజేపీ ముందస్తు ప్లాన్
X
తెలంగాణలో 'ముందస్తు' ఉహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో మాదిరిగా బీఆర్ఎస్ ఎన్నికల సమయానికంటే ముందుగానే ప్రభుత్వం చేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయ ఓపెనింగ్ లు, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం వంటివి చూస్తే ప్రభుత్వం తొందర్లోనే రద్దయ్యే సూచనలను కనిపిస్తున్నాయని అంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చని తాము సిద్ధమనే విధంగా బీజేపీ ఫ్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అవుతోంది. ఇప్పటికే 'సరళ' యాప్ ద్వారా కార్యకర్త రేంజ్ లో ఉన్నవారిని అలర్ట్ చేసిన రాష్ట్ర నాయకులు ఇప్పుడు గల్లీ సమావేశాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. తాజగా నిర్వహించే సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటేరియట్ ను ప్రారంభించనున్నారు. ఆ తరువాత కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అంటున్నారు. గతంలో పలుసార్లు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్ణీత తేదీనాటికే ఉంటాయని ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ కు కలిసి రావడం లేదు. దీంతో అభివృద్ధి పనులు తొందరగా ముగించి వాటి ద్వారా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పోటీని ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సమాయత్తమవుతోంది.

15 రోజుల్లో 9 వేల సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న బీజేపీ నాయకులు.. ఈ సమావేశాల ద్వార ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. బహిరంగ సభల ద్వారాకాకుండా ఇలాంటి సమావేశాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఫేస్ టు ఫేస్ కలుసుకునే చాన్స్ ఉంటుంది.

దీంతో వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్లాన్ చేసే విధంగా వారికి హామీలు ఇవ్వనున్నారు. దీంతో ఇప్పటి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నవాళ్లు బీజేపీ వైపునకు తిరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.

అటు బండి సంజయ్ పాదయాత్ర 6 విడతకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 5 విడతల ద్వారా గ్రామ గ్రామాన బీజేపీకి బలం పెరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ బిజీగా ఉండడంతో 6వ విడత పాదయాత్ర ఎప్పుడు నిర్వహించాలా..? అనే దానిపై తాజాగా నిర్వహించే సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీ పెద్దల అండ బలంగా ఉండడంతో రాష్ట్రా నాయకులు అదే ఊపుతో ప్రజల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సుసాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారు.

ఇక మిగతా పార్టీల్లో అసంతృప్తితో ఉన్నవాళ్లను బీజేపీలో చేర్చుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. అధికార పార్టీలోనూ కొందరు బీఆర్ ఎస్ నుంచి కొందరు తమ పార్టీ వైపు చూస్తున్నారని కమలనాథులు అంటున్నారు. కానీ వారు చివరి వరకు వేచి చూసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీలో టికెట్ హామీ ఇస్తేనే చేరే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ హామీ ఇచ్చే అధికారం రాష్ట్ర నాయకులకు లేదు. అందుకే కొందరు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.