Begin typing your search above and press return to search.

శబరిమల.. బీజేపీకి మరో 'అయోధ్య'

By:  Tupaki Desk   |   21 Nov 2019 2:30 PM GMT
శబరిమల.. బీజేపీకి మరో అయోధ్య
X
1990ల్లో అయోధ్యలో రామమందిర నిర్మిస్తామనే అజెండాను అస్త్రంగా మలిచి తదనంతర కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయోధ్య అంశాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ ఉత్తరాధి రాష్ట్రాల్లో ప్రజల మద్దతు కూడగట్టి బలపడింది. సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అయితే నాడు ప్రధాని అయిన వాజ్ పేయి ఆ హామీ నెరవేర్చలేదు. ఆయన వారసుడైన మోడీ ఇన్నేళ్లకు ఆ హామీని నెరవేర్చాడు.

అయితే ఉత్తరాదిలో బీజేపీ పాగా వేయడానికి అయోధ్య ఒక అస్త్రంగా ఆ పార్టీకి దొరికింది. ఇప్పుడు ఇన్నేళ్లకు ఆ హామీని వారసుడు మోడీ నెరవేర్చాడు.. ఇప్పుడు ఉత్తరాధిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిపై కూడా కన్నేసింది. దక్షిణాదిలో ఎదగడానికి ఇప్పుడు బీజేపీకి ‘శబరిమల’ రూపంలో మరో అయోధ్య దొరికినట్టు వాతావరణం కనిపిస్తోంది.

రెండేళ్ల క్రితం నుంచి బీజేపీ శబరిమల వివాదాన్ని రాజేస్తోంది. అక్కడి అధికార కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఈ వివాదంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 40 ఏళ్లుగా అక్కడ పాగా వేసిన కమ్యూనిస్టులను - కాంగ్రెస్ ను ఇదే ‘శబరిమల’ ఆయుధంతో ఎదుర్కొంది.

అయితే రెండు నెలలుగా శబరిమల వివాదం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండడం.. తీర్పు నేపథ్యంలో ఇప్పుడు హిందువులను ఏకం చేసే ఆయుధంగా ‘శబరిమల’ ను బీజేపీ తెరపైకి తేవడానికి రంగం సిద్ధం చేసింది. ఇదే ఆయుధంతో దక్షిణాదిలో బలపడడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఉత్తరాదిన ఉన్న భక్తి సెంటిమెంట్ దక్షిణాది వారికి చాలా తక్కువ. అక్కడ అమలు చేసిన ప్లాన్లు ఇక్కడ అమలు అవుతాయా లేవా అన్న టెన్షన్ బీజేపీకి పట్టుకుంది. శబరిమల పై పోరాడినా గత పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంది తక్కువే. బీజేపీకి పెద్దగా సీట్లు రాలేదు. ఈ నేపథ్యంలో మరో అయోధ్య అయిన ‘శబరిమల’ బీజేపీకి ఎలాంటి ఫలితం అందిస్తుందనేది వేచిచూడాలి.