Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క కోసం.. బాబును కాకాప‌డుతున్న బీజేపీ..!!

By:  Tupaki Desk   |   29 March 2023 1:54 PM GMT
క‌ర్ణాట‌క కోసం.. బాబును కాకాప‌డుతున్న బీజేపీ..!!
X
ద‌క్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి ఇప్పుడు క‌ర్ణాట‌క మ‌హాసంక‌టంగా మారింది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో నిజానికి బ‌ల‌మైన మెజారిటీ రాలేదు. ప్ర‌జ‌లు పూర్తిగా బీజేపీకి ప‌ట్టంక‌ట్ట‌లేదు. అందుకే య‌డియూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేపట్టినా.. బ‌లం నిరూపించుకోలేక చ‌తికిల‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో జేడీఎస్‌.. కాంగ్రెస్‌లు సంయుక్తంగా కొన్నాళ్లు ప‌ద‌వి చేప‌ట్టాయి. ఈ గ్యాప్‌లో క‌ర్ణాట‌క బీజేపీ నేత‌లు.. చేయాల్సింది చేశారు.

కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకొని.. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌లు వ‌చ్చేలా చేసి.. విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం బొమ్మై ముఖ్య మంత్రిగా ఉన్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌ల‌కు క‌ర్నాట‌క రెడీ అయింది. అయితే.. బీజేపీ అనుకున్న విధంగా అయితే.. ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో గెలుపుగుర్రం ఎక్క‌డం.. బీజేపీకి అంత న‌ల్లేరు పై న‌డ‌క కాదు.

కాంగ్రెస్‌, జేడీఎస్ స‌హా గ‌నుల ఘ‌నుడు జ‌నార్ద‌న్‌రెడ్డి కూడా.. పుంజుకున్నారు. దీంతో ప్రాంతాల వారీగా.. కులాల వారీగా కూడా ఓటు బ్యాంకు భారీ ఎత్తున చీలిపోయింది.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు క‌లిసి వ‌చ్చే వారిని క‌లుపుకొని పోయేందుకు బీజేపీ పెద్ద‌లు ప‌క్కా ప్ర‌ణాళిక సిద్దం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని క‌ర్నాట‌క‌లో ప్ర‌చారం చేసేలా.. ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

క‌ర్ణాట‌క‌లో తెలుగు దేశం పార్టీకి ఒక వింగ్ ఉంది. ముఖ్యంగా ఏపీతో స‌రిహ‌ద్దులు ఉన్న అనంత‌పురం నుంచి చిత్తూరు వ‌ర‌కు కూడా.. టీడీపీ సానుకూల ఓటు బ్యాంకు ఉంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ టీడీపీ ప్ర‌చారాన్ని వాడుకోవాల‌ని కోరుతున్నారు.

ఇటీవ‌ల యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు ఏపీ పోలీసులు.. వివాదంగా మారితే... క‌ర్ణాట‌క పోలీసులు అక్క‌డి ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు స‌హ‌కారం అందించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ.. వ్యూహాత్మ‌కంగా టీడీపీతో ప్ర‌చారం చేయించాల‌ని చూస్తోంద‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.