Begin typing your search above and press return to search.

బీజేపీ సింగిలేనా.. ?

By:  Tupaki Desk   |   15 Jan 2022 10:10 AM GMT
బీజేపీ సింగిలేనా.. ?
X
ఏపీ రాజకీయాలను ఒక్కసారి జాగ్రత్తగా పరికిస్తే జాతీయ పార్టీలకు కలసిరావడం లేదు అనే అర్ధమవుతుంది. జాతీయ అజెండాను వారు ఏపీలో అమలు చేద్దామనుకుంటారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అవి సరపడడంలేదు. దాంతో ఎదగలేక, ఒకరితో జట్టు కుదరక అష్టకష్టాలు పడుతున్నాయి. నాడు కాంగ్రెస్ అయినా నేడు బీజేపీ అయినా అదే సీన్ కనిపిస్తోంది.

ఏపీలో బీజేపీ బాగా విస్తరిస్తుంది అనుకున్న వాళ్ళకు కూడా ఇపుడు జరుగుతున్న పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయి. నిజానికి ఇపుడు బీజేపీ ఎదుగుదలకు దారులు పూర్తిగా మూసుకుపోతున్నాయి. మోడీ క్రేజ్ దేశంలో బ్రహ్మండంగా వెలిగిపోతున్న రోజుల్లోనే బీజేపీ ఏపీలోనూ కళ కట్టాలి. నాడు కొంతమంది ఎంపిక చేసిన నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించింది.

అయితే వారు ఆలోచించి చెబుతామని అన్నారు. టీడీపీ నుంచి కొంతమంది ఎంపీలు వెళ్లారు, ఆ తరువాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాలేదు. ఈ లోగా మోడీ పాలన మీద దేశంలో సంగతి ఎలా ఎలా ఉన్నా ఏపీ వరకూ అసంతృప్తి మొదలైంది. విభజన హామీలు నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా వంటివి ఇవ్వకపోవడంతో ఏపీ జనాలు కమలం అంటేనే గుర్రు మీద ఉన్నారు.

అలా 2019 ఎన్నికల నాటికి ఏపీలో టీడీపీ జట్టు నుంచి బీజేపీ విడిపోయింది. ఎన్నికల తరువాత జనసేంతో దోస్తీ కుదిరినా ఇది ఎంతవరకూ ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. యూపీ సహా ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ ప్రభావం మీద అది ఆధారపడి ఉంటుంది అంటున్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఫరవాలేదు, ఈసారి టీడీపీ కూడా జట్టు కట్టేందుకు ఆసక్తిగా ఉంటుంది. కానీ యూపీలో కనుక బీజేపీ ఓడిపోతే మాత్రం ఏపీలో రాజకీయ లెక్కలు ఒక్కసారిగా మారిపోతాయి.

అపుడు టీడీపీ తన పొలిటికల్ స్టాండ్ ని పూర్తిగా మార్చుకుంటుంది అంటున్నారు. అలాగే జనసేన కూడా మంచి సందర్భం చూసుకుని పొత్తుని చిత్తు చేసే చాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. దీని మీద వివిధ పార్టీలలోని సీనియర్ నేతల మధ్య చర్చ కూడా సాగుతోంది. బీజేపీలో ఉన్న ఎంపీ టీజీ వెంకటేష్ లాంటి వారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ పొత్తు ఉండదు అని అంచనా వేస్తున్నారుట. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ వామపక్షాలు కలసి ముందుకు సాగుతాయని కూడా తమ సన్నిహితులతో చెబుతున్నారుట. ఈ కారణంగానే ఆయన బీజేపీ నుంచి బయటకు రావడానికి చూస్తున్నారు అని టాక్.

ఆయనే కాదు, ఏపీలో పరిణామాలను చూసిన వారు కూడా బీజేపీ ఇక మీదట పొలిటికల్ గా సింగిల్ అవక తప్పదు అంటున్నారు. మరో వైపు ఎన్నికల వేళకు బీజేపీలో చేరిన మాజీ టీడీపీ తమ్ముళ్ళు చాలా మంది వెనక్కి వస్తారని కూడా అంటున్నారు. దీనికి మోడీ క్రేజ్ తగ్గడంతో పాటు, దేశంలో మారుతున్న రాజకీయం, యాంటీ మోడీ కూటమికి అవకాశలు ఎక్కువగా ఉండడమే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.