Begin typing your search above and press return to search.

పరేడ్ గ్రౌండ్ వేదిక కింద పీఎంవో.. అక్కడి నుంచి కూడా కార్యకలాపాలు

By:  Tupaki Desk   |   3 July 2022 10:39 AM GMT
పరేడ్ గ్రౌండ్ వేదిక కింద పీఎంవో.. అక్కడి నుంచి కూడా కార్యకలాపాలు
X
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా గడిచిన మూడు రోజుల నుంచి మొదలైన సందడి.. ఈ రోజు (ఆదివారం) పీక్స్ కు చేరింది. ఈ సాయంత్రం నాలుగున్నరకు మొదలయ్యే మోడీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 28 గంటలకు ముందు జలవిహార్ వేదికగా చేసుకొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు విమర్శలు చేయటంతో పాటు.. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికే క్రమంలో ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీటితో పాటు.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అధికార టీఆర్ఎస్ చుక్కలు చూపించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీటన్నింటికి నరేంద్ర మోడీ ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పరేడ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఎదుర్కోనేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వాతావరణం అనుకూలించక వర్షం పడితే కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పరేడ్ గ్రౌండ్ లో మోడీ ప్రసంగించేందుకు సిద్ధం చేసిన వేదిక వద్ద కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నింటికి మించి.. వేదిక కిందగా ఒక గుడారం నమూనాలో ఏర్పాటు చేసిన కార్యాలయం అత్యంత పవర్ ఫుల్ గా అభివర్ణిస్తున్నారు. పీఎంవోలో ఎలాంటి వ్యవస్థ పని చేస్తూ ఉంటుందో.. ఇంచుమించు అలాంటి వ్యవస్థే ఇక్కడా పని చేస్తుందని చెబురతున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా కొందరు అధికారులు పీఎంవో నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వచ్చినట్లుగా చెబుతున్నారు.

గ్రౌండ్ లోకి ప్రధాని మోడీ అడుగు పెట్టటానికి కొన్ని గంటల నుంచే ఈ ఆఫీసు పని చేస్తుందని చెబుతున్నారు. ఇందులో అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా చెబుతున్నరు. పరేడ్ గ్రౌండ్ లో అత్యంత పవర్ ఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే.. వేదిక కింద ఏర్పాటు చేసిన గుడారం లాంటి ప్రాంతమేనని చెబుతున్నారు. మోడీ ఉన్నంతసేపు కూడా మొబైల్ పీఎంవో మాదిరి ఈ గుడారం వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది.