Begin typing your search above and press return to search.

మోదీ ఆదేశాలు బేఖాతరు..20 మందితో దీపాలతో ర్యాలీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   6 April 2020 1:00 PM GMT
మోదీ ఆదేశాలు బేఖాతరు..20 మందితో దీపాలతో ర్యాలీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే!
X
తెలంగాణ గోషా మహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ .. ఈయన సంచలనాలకు కేంద్రబిందువు. నిత్యం వివాదాల తో స్నేహం చేస్తుంటాడు. ఈయన ఏది చేసినా కూడా ఒక సంచలనమే. తాజాగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు లైట్లు ఆర్పివేసి.. దీపం వెలగించి కరోనాను తరిమివేసేందుకు మన ఐకమత్యం చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అయితే ఇంటిలో, బాల్కనీలో ఉండి మాత్రమే దీపం పట్టుకోవాలని సూచించారు. కానీ దానిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉల్లంఘించారు.

ప్రధాని నిన్న రాత్రి అందరినీ రాత్రి 9 గంటలకు లైట్లు కట్టేసి, 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని కోరారు. అలాగే పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరు కూడా ఇంట్లో నుండి బయటకి రావద్దు అని, సామజిక దూరం పాటిస్తూనే దీపాలు వెలిగించాలని కోరారు.
కానీ దేశమంతా ప్రజలు దీపాలు పెట్టమంటే దీపావళి చేసిన విషయం తెలిసిందే. ఏకంగా కొంతమంది గో కరోనా అంటూ భారీ ర్యాలీలు కూడా తీశారు. సాధారణ ప్రజలు అంటే ఎదో అనుకోవచ్చు కానీ , సమాజంలో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే కూడా దీపాలతో ర్యాలీకి దిగడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఎమ్మెల్యే రాజాసింగ్ దాదాపుగా ఒక 30 మంది గుంపును వెంటేసుకొని కాగడాలు పట్టుకొని వీధిలోకి వచ్చి గో బాసీజ్ గో బ్యాక్ .. చైనా వైరస్ గో బ్యాక్, చైనీస్ వైరస్ గో బ్యాక్ అని నినాదాలు చేసారు. రాజా సింగ్ తీరు బీజేపీని ఇరుకున పడేసే అవకాశం ఉంది. మోడీ చెప్పిన దాన్ని బీజేపీ నేతలు ఉల్లంఘించారని విమర్శలు చేసే అవకాశం ఉంది. మిగిలిన నేతలంతా కూడా ఇంట్లోనే ఉండి దీపాలు వెలిగిస్తే ..రాజాసింగ్ మాత్రం ఎదో యుద్ధం గెలిచినట్టు తన అనుచరులని వెంటబెట్టుకొని విధుల్లోకి వచ్చారు. దీని కింద నెటిజెలు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ... కరోనా ఎక్కడిదాకా వెళ్లిపోయింది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.