అసెంబ్లీలో పోర్న్ చూడడంపై వివరణ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే

Fri Mar 31 2023 17:10:51 GMT+0530 (India Standard Time)

BJP MLA Responds To Adult Video Row

త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్నాథ్ శాసనసభలో పోర్న్ చూస్తూ నిన్న వీడియోకు చిక్కడంతో పెను దుమారం రేగింది. త్రిపుర అసెంబ్లీలో ఈ బీజేపీ ఎమ్మెల్యే చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తాయి.అయితే ఈ విమర్శలతో దిగివచ్చిన ఎమ్మెల్యే తాజాగా తాను  ఎందుకు అలా దొరికిపోయారో సృజనాత్మకంగా వివరణ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగా తాను పోర్న్ చూడలేదని ఇన్కమింగ్ కాల్ తీసుకునేటప్పుడు అనుకోకుండా పోర్న్ ప్లే అయ్యిందని చెప్పాడు. బడ్జెట్పై చర్చ సందర్భంగా తాను ఆ క్లిప్ను చూడలేదని జాదవ్ ఖండించారు.

గతంలో బడ్జెట్ చర్చ సందర్భంగా జాదవ్ పోర్న్ చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్షాలు ప్రశ్నించగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం ముదరడంతో బీజేపీ నాయకత్వం జాదవ్ను వివరణ కోరింది.

బడ్జెట్పై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు జాదవ్ పోర్న్ సైట్ను యాక్సెస్ చేయడం ఆపై అతను చూస్తున్న క్లిప్పై స్క్రోల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగిపోయింది..

జాదవ్ ఏదో అన్యాపదేశంగా కాకుండా సృహతో ఉండే ఈ పోర్న్ సర్ఫింగ్ చేశాడని ఫుటేజీ స్పష్టంగా తెలియజేస్తోంది. అతను పోర్న్కి అతుక్కుపోయిన దృశ్యాలను వెనుక నుంచి ఎవరో వీడియో తీశారు. జాదవ్ బగ్బాసా నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున  ఎమ్మెల్యేగా గెలిచారు.

త్రిపుర శాసనసభ ప్రస్తుత సమావేశాలు మార్చి 24న ప్రారంభమైన సంగతిని తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఇలా అసెంబ్లీలో దర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూడడం ఇప్పుడు అది అనుకోకుండా ప్లే అయ్యిందని సమర్థించుకోవడం సూట్ కాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.