స్టార్ హీరోయిన్లను నమ్ముకున్న బీజేపీ!

Sun Jul 05 2020 07:00:03 GMT+0530 (IST)

BJP Committee with Star Heroines

ప్రాంతీయపార్టీల హవా కొనసాగే తమిళనాడులో అస్సలు ఉనికే లేని జాతీయ పార్టీ బీజేపీ స్టార్ హీరోయిన్లను నమ్ముకుంది. తాజాగా బీజేపీ తమిళనాడు రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరోయిన్లతో తళుకుమనేలా కమిటీని ఏర్పాటు చేశారు.బొద్దుగుమ్మ - స్టార్ హీరోయిన్ నమితతోపాటు అలనాటి స్టార్ హీరోయిన్ గౌతమి - మరో ప్రముఖ నటి గాయిత్రీ రఘురామ్ - మాజీ ఎంపీ శశికళ పుష్పాకు తమిళనాడు రాష్ట్ర బీజేపీలో కీలక పదవులు దక్కాయి.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఎల్. మురుగన్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఆయనతోపాటు పదిమంది ఉపాధ్యక్షుడు - నలుగురు ప్రధాన కార్యదర్శులు - మహిళా అధ్యక్షుడురాలు.. ఇలా అన్ని విభాగాలను భర్తీ చేశారు.

ప్రముఖ సినీ నటి గాయత్రి రఘురామ్ కు ఏకంగా బీజేపీ తమిళనాడు సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి దక్కింది. ఇక స్టార్ హీరోయిన్ నమితక రాష్ట్ర కమిటీలో కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. అలనాటి నటి గౌతమికి బీజేపీ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యురాలిగా అవకాశమిచ్చారు. బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా మీనాక్షిని నియమించారు.

ఇలా ప్రముఖ నటీమణులకు సినీ ప్రముఖులకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. వారితోనే కాస్తో కూస్తో బలపడాలని చూస్తోంది.