Begin typing your search above and press return to search.

రామాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటే?

By:  Tupaki Desk   |   5 Aug 2020 6:30 AM GMT
రామాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటే?
X
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఈ మధ్యాహ్నం భూమి పూజ జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ సహా 150మందికి పైగా ప్రముఖులు దీనికి హాజరుకానున్నారు. అయితే ఈ భూమి పూజ తరువాత నిర్మాణ పనులు ప్రారంభమై ఎప్పుడు ఈ రామాలయం సిద్ధం అవుతుందనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చింది.

దేశంలోని హిందువులంతా ఆసక్తిగా ఎదురుచూసే హిందువుల దైవం శ్రీరామ ఆలయ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని.. బీజేపీ హయాంలోనే అందుబాటులోకి తేవాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై తాజాగా శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ధర్మకర్త స్వామి పరమానంద్ మహారాజ్ మాట్లాడారు.ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి నిర్మాణ సంస్థకు 32 నెలల సమయం ఇచ్చామని తెలిపారు. అంటే రెండేళ్ల 8 నెలల్లో రామాలయం పూర్తి కావచ్చని వివరించారు.

ఈ ఆలయం నిర్మాణంలో దేశవ్యాప్తంగా పూజలు చేసిన ప్రదేశాలు అన్నింటిలో ఉపయోగించిన రాయిని రామాలయ నిర్మాణంలో ఉపయోగిస్తామని తెలిపారు. అయోధ్యలో చెక్కబడిన రాళ్లను కూడా ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తామని వివరించారు. ఈ రాళ్లతోపాటు వేలాది ఇటుకలను అయోధ్యలో ఉంచారు.

రామాలయ నిర్మాణానికి విరాళం ఇచ్చే భక్తులకు రసీదు ఇస్తామని.. వారు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవచ్చని వివరించారు. 2023లో రామాలయం పూర్తవుతుందని ధర్మకర్త స్వామి తెలిపారు.