నెలకు 3సార్లే స్నానం చేసే ఈ అమ్మాయి.. కారణం చెప్పి షాకిస్తోంది

Sat Aug 13 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Aydan Jane About Taking Bathing

ప్రపంచం కుగ్రామంగా పలువురు పోలుస్తారు. నిజానికి సాంకేతికత పెరిగిన తర్వాత ఈ పోలిక చెప్పినా.. అది రియాలిటీలోకి వచ్చింది మాత్రం సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాతే. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. చేతి వేలి కొసలతో చేసే పోస్టు ప్రపంచంలోని కోట్లాది మందికి చేరటమే కాదు.. విషయం ఉండాలే కానీ ఇట్టే అందరికి చేరిపోయే పరిస్థితి.అయితే.. కొన్నింటిలో విషయం లేకున్నా.. వాటికుండే విలక్షణతో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు చెప్పే అంశం కూడా ఆ కోవకు చెందినదే. నిద్ర లేచిన కాసేపటికే చేసే ముఖ్యమైన పనుల్లో స్నానం ఒకటి. కానీ.. ప్రసిద్ధ టిక్ టాకర్ 23 ఏళ్ల ఐడాన్ జేన్ మాత్రం కాస్త భిన్నం.

అమ్మడికి స్నానం చేయటమే అస్సలు నచ్చదట. ఇటీవల కాలంలోని యూత్ పిల్లలకు వచ్చి పడుతున్న దరిద్రాల్లో స్నానం చేయకుండా.. కాసింత బాడీ స్ప్రే కొట్టేసుకొని కాలం గడిపేయటం. ఒకవేళ.. వాతావరణం చల్లగా ఉండే మరింత చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కేసులకు మించిపోయి.. స్నానం చేయకుండా వారాల తరబడి ఉండే విషయంలో జేన్ చాలా ముందు ఉంటుంది. అమ్మడు వారానికి కేవలం మూడు రోజులు.. అది కూడా ఆ మూడు రోజులు మాత్రమే స్నానం చేయటానికి ఇష్టపడుతుందట.

మిగిలిన రోజుల్లో స్నానం చేయటమంటే అస్సలు ఇష్టం ఉండదట. అదేంటి? ఒక రోజు సరిగ్గా స్నానం చేయకపోతే.. ఇబ్బంది అవుతుంది కదా? అన్న ప్రశ్నకు ఆమె మాత్రం తనకు అలాంటి ఇబ్బందులే ఉండవని చెబుతోంది. ఇటీవల తన ఫాలోవర్స్ కు తనకు సంబంధించిన వివరాల్ని చెబుతూ.. నెలకు మూడు సార్లు మాత్రమే తాను స్నానం చేస్తానని.. అది కూడా నెలసరి సమయంలోనే అని చెబుతోంది. మరి చెమట వాసన రాదా? అంటే.. తనకు అలాంటి ఇబ్బందే ఉండదని.. చివరకు మురికి కూడా పట్టదంటూ గొప్పలు చెప్పుకుంటోంది.

తాను చేసే దరిద్రపుగొట్టు పనిని గొప్పగా చెప్పుకుంటూ.. తాను అతి తక్కువ రోజులు స్నానం చేయటం కారణంగా తాను పర్యావరణాన్ని.. నీటి వనరుల్నిచాలా సేవ్ చేస్తున్నట్లుగా బీరాలు పలుకుతోంది.  వారానికి పైనే స్నానం చేయకుండా ఉన్నప్పటికీ తాను మాత్రం ఫ్రెష్ గా కనిపిస్తానని చెప్పే ఈ అమ్మాయి తీరు చూసిన కొందరు మురిసిపోతే.. ఎక్కువ మంది మాత్రం తిట్టి పోస్తున్నారు.

నీ వరకు నువ్వు ఓకే.. నీతో ఉండే వారికేగా ఇబ్బంది అంతా అంటూ మండిపడుతున్నారు. నీ కోసం కాకున్నా.. నీతో ఉండే వారి కోసమైనా సరే.. స్నానం చేయ్ అంటూ కాస్తంత ఆగ్రహాన్నే బదులిస్తున్నారు. అయితే.. ఇలాంటి మాటల్ని పట్టించుకోకుండా తన మానాన మాను ముందుకెళుతున్న ఈ అమ్మడ్నిచూస్తే.. కాల మహిమ అనుకోకుండా ఉండలేం.