Begin typing your search above and press return to search.

అవినాష్ ముందస్తు బెయిల్ : మే 31... జడ్జిమెంట్ డే

By:  Tupaki Desk   |   30 May 2023 10:13 PM GMT
అవినాష్ ముందస్తు బెయిల్ : మే 31... జడ్జిమెంట్ డే
X
వైసీపీలో అతి ముఖ్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజకీయ వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పబోయే అతి కీలకమైన తీర్పు జూన్ ఫస్ట్ న వెలువడనుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ మే 31న వెలువరించనుంది. ఈ కేసును పూర్వం పరం అన్నీ పరిశీలించి అటు సీబీఐ ఇటు అవినాష్ రెడ్డి లాయర్ల వాదనలు విన్న వెకేషన్ బెంచ్ తీర్పుని రిజర్వ్ చేసింది.

ఆ తీర్పు మే 31న వెలువడుతుంది. మరి ఏ విధంగా తీర్పు ఉంటుంది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అన్నది వైసీపీతో పాటు ఏపీలోని మొత్తం రాజకీయ పార్టీలలో ఆసక్తిని ఉత్కంఠను పెంచుతోంది. ఈ తీర్పు ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చేస్తుంది అని అంటున్నారు.

కడప ఎంపీని అరెస్ట్ చేస్తామని ఇప్పటికి పలుమార్లు సీబీఐ తరఫున లాయర్లు కోర్టుకు స్పష్టంగా తెలియచేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏమి జరిగింది అన్నది తెలుసుకుంటామని అంటోంది. అంటే ముందస్తు బెయిల్ కనుక హై కోర్టు ఇవ్వకపోతే సీబీఐ తన దూకుడుని పెంచే చాన్స్ ఉంది.

తీర్పు వెలువడిన ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు అని అంటున్నారు. ఒక వేళ ముందస్తు బెయిల్ మంజూరు అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఏ సందడి లేనట్లే. విచారణకు అవినాష్ రెడ్డి వెళ్ళి సీబీఐ అడిగిన వాటికి జవాబు చెప్పవచ్చు. అయితే హై కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా దాన్ని సీబీఐ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి.

అయితే దానికి మరి కొన్ని రోజులు సమయం పట్టవచ్చు. అయితే అవినాష్ రెడ్డి కేసులో మెరిట్స్ డీ మెరిట్స్ చాలా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయనను ఇప్పటిదాకా నిందితుడు అని కూడా సీబీఐ పేర్కొనలేదని స్పష్టం చేస్తున్నారు. ఆయన్ని సాక్షిగానే పిలుస్తున్నారు కాబట్టి ఆయన విషయంలో అరెస్ట్ వంటి పెద్ద చర్యలకు సీబీఐ దిగకూడదనే కొంతమంది వాదంగా ఉంది.

అయితే సీబీఐ ఈ కేసుకు సంబంధించి దాదాపుగా అనుమానితులను నిందితులను అరెస్ట్ చేసింది. ఇక ఒకే ఒక్కరు అన్నట్లుగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేయడమే జరిగితేనే ఈ కేసులో ఏదో ఒకటి తేలుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. అయితే అవినాష్ రెడ్డిని విచారణ పేరుతో ఇప్పటికి సీబీఐ ఏడు సార్లు పిలిచింది మరి ఆయన ఏ విషయాలు చెప్పారు. సీబీఐ అధికారులు ఏమడిగారు అన్నది తెలియకపోయినా ఈ కేసులో ఆయన అరెస్ట్ మాత్రమే ముఖ్యం అని సీబీఐ భావించడమే వైసీపీకి ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు.

తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం సొంత జిల్లా అతి ముఖ్య నేతను అరెస్ట్ చేస్తే మాత్రం అది రాజకీయంగా వైసీపీకి పెద్ద ట్రబుల్ గా ఉంటుంది అని అంటున్నారు. అయితే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అంటోంది కానీ ఆయన అరెస్ట్ తో ఈ కేసులో మొత్తం చిక్కు ముళ్ళు విప్పుతామని కచ్చితంగా చెప్పలేకపోతోందని అంటున్న వారూ ఉన్నారు. మొత్తానికి అవినాష్ రెడ్డి సహా వైసీపీకి, అలాగే ఇతర రాజకీయ పార్టీలకు హై కోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పు ఏంటన్న ఉత్కంఠ అయితే ఉంది మరి.