Begin typing your search above and press return to search.

తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ..!

By:  Tupaki Desk   |   9 May 2021 8:30 AM GMT
తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ..!
X
ఐపీఎల్ ఆడటానికి వచ్చిన అందరు ఆటగాళ్లు కరోనా వ్యాప్తి కారణంగా తమ తమ దేశాలకు తిరిగి వెళ్లి పోయారు. అయితే భారత్ నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా నిషేధించడంతో ఆ దేశ ఆటగాళ్లు మాత్రం స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక మదనపడ్డారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం నేరుగా దేశానికి రాకుండా మాల్దీవ్స్ కు వెళ్లి అక్కడ కొద్ది రోజులు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రావాలని క్రికెటర్లకు సూచించింది.

ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తదితర ఆటగాళ్లు, పలువురు కామెంటర్స్ మాల్దీవ్స్ కు వెళ్లిపోయారు. క్రికెటర్ల అందరూ అక్కడ ఒక రిసార్టులో ఉంటున్నారు.
కాగా అక్కడి బార్ లో డేవిడ్ వార్నర్, మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ తాగిన మైకంలో కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తమపై వచ్చిన వార్తలన్నీ వట్టి అబద్ధాలేనని, తామిద్దరం మంచి స్నేహితులమని డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు.

మాల్దీవ్స్ లోని తాజ్ కోరల్ రిసార్ట్ లోని బార్ వద్ద తప్పతాగిన డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఒకరినొకరు కొట్టుకున్నారని 'ది డైలీ టెలి గ్రాఫ్ ' ఓ కథనాన్ని ప్రచురించింది. వారిద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ తాగిన మైకంలో ఒకరినొకరు తిట్టుకోవడంతో మాట మాట పెరిగి అది కొట్టుకునే దాకా వెళ్లిందని ఆ కథనంలో పేర్కొంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలను డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు. తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. పత్రికలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని వారు కొట్టిపారేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లు రాయడం ఏంటంని విమర్శలు చేశారు.

దీనిపై ముందుగా స్లేటర్ సీనియర్ జర్నలిస్ట్ ఫిల్ రోత్ ఫీల్డ్ కు ఓ సందేశాన్ని పంపించాడు. అందులో... వార్నర్ నేను ఎంతో మంచి స్నేహితులని, తమ మధ్య గొడవ ఎందుకు జరుగుతుందని, అలాంటి సందర్భమే తమ మధ్య రాదని అందులో తెలిపాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా ఆయనకు ఓ సందేశం పంపించాడు. ' ఇద్దరు స్నేహితుల మధ్య ఎలాంటి గొడవ జరగకపోయినా నిరాధార ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించాడు. ఇలాంటి వార్తలు బలమైన ఆధారం ఉన్నప్పుడు మాత్రమే రాయాలని, అసలేం జరిగిందో తెలియకుండానే, దగ్గర నుంచి చూడకుండానే ఎలా వార్తలు రాస్తారని వార్నర్ మండిపడ్డాడు. గతంలో బాల్ టాంపరింగ్ కు పాల్పడిన డేవిడ్ వార్నర్ ఏడాది పాటు జట్టుకు దూరమయ్యాడు. అప్పట్నుంచి అతడు వివాదాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి వార్నర్ వివాదంలో ఇరుక్కున్నాడు.