Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఇంటికెళ్లారు.. పాపం వాళ్ల ప‌రిస్థితే..

By:  Tupaki Desk   |   6 May 2021 5:30 AM GMT
ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఇంటికెళ్లారు.. పాపం వాళ్ల ప‌రిస్థితే..
X
ఐపీఎల్ కు క‌రోనా తెచ్చిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. టోర్నీ అర్ధంతరంగా ఆగిపోవ‌డంతో బీసీసీఐకి వంద‌ల కోట్ల న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇటు ప్రాంచైజీలకూ న‌ష్టాలు త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు.. ఆట‌గాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. టోర్నీ నిలిపేయ‌డంతో.. ఆట‌గాళ్ల‌ను సొంత దేశాల‌కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.

ఇందులో భాగంగా 11 మంది ఇంగ్లండ్ ఆట‌గాళ్లు స్వ‌దేశానికి వెళ్లిపోయారు. వీరిలో బ‌ట్ల‌ర్‌, మొయిన్ అలీ, శామ్ క‌ర‌న్, టామ్ క‌ర‌న్, వోక్స్, బెయిర్ స్టో, జేస‌న్ రాయ్, శామ్ బిల్లింగ్స్ బుధ‌వారం ఇంగ్లండ్ చేరుకున్న‌ట్టు ఈసీబీ ప్ర‌క‌టించింది. ఇంకా ముగ్గురు క్రికెట‌ర్లు వెళ్లాల్సి ఉంది. మోర్గాన్‌, మ‌లాన్‌, జోర్డాన్ రెండు రోజులు లేటుగా బ‌య‌ల్దేర‌నున్నారు. అయితే.. ఇంగ్లండ్ కు వెళ్లిన త‌ర్వాత కూడా వీళ్లు ఇంటికి వెళ్ల‌డానికి లేదు. ప‌ది రోజుల పాటు ఓ హోట‌ల్లో క్వారంటైన్లో ఉన్న త‌ర్వాతే నివాసాల‌కు వెళ్లాల్సి ఉంది.

ఇక‌, న్యూజీలాండ్ ఆట‌గాళ్లు కూడా స్వ‌దేశానికి ప‌య‌న‌మ‌య్యారు. అయితే.. అంద‌రూ వెళ్ల‌ట్లేదు. ఐపీఎల్ ఆడేందుకు వ‌చ్చిన మొత‌త్ం 17 మంది ఆట‌గాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరిలో కొంద‌రు ఇంగ్లండ్ వెళ్ల‌బోతున్నారు. ఇంగ్లండ్ తో సిరీస్‌, భార‌త్ తో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో పాల్గొంటారు. వారిలో.. విలియ‌మ్స‌న్, బౌల్ట్‌, జేమీస‌న్‌, సాన్ ట్న‌ర్, ఫెర్గూస‌న్‌, నీష‌మ్‌, ఫిన్ అలెన్ ఉన్నారు. అయితే.. భార‌త్ విమానాల‌పై ఇంగ్లండ్ ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో మే 10 వ‌ర‌కు ఇండియాలోనే ఉంటారు. ఆ త‌ర్వాత బ‌య‌ల్దేరుతారు. మిగిలిన న్యూజీలాండ్ ఆటగాళ్లు ఫ్లెమింగ్‌, మెక్ క‌ల్ల‌మ్, మిల్స్, షేన్ బాండ్‌, త‌దిత‌రులు స్వదేశానికి వెళ్తారు. వీరికోసం రెండు ప్రాంఛైజీలు ప్ర‌త్యేక విమానాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

అయితే.. ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల ప‌రిస్థితే ఇబ్బందిగా మారింది. భార‌త్ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అనుమ‌తి లేనందున‌.. వారు మొద‌ట‌గా మాల్దీవుల‌కు వెళ్లిపోనున్నారు. అక్క‌డ దాదాపు 15 రోజులు గ‌డిపిన త‌ర్వాత‌నే స్వ‌దేశానికి వెళ్లే వీలుంది. ఐపీఎల్ లో ఉన్న‌ దాదాపు 40 మంది ఆస్ట్రేలియ‌న్లు రెండు రోజుల్లో మాల్దీవుల‌కు వెళ్ల‌నున్నారు. వీరంద‌రినీ స్వ‌దేశానికి పంపించే బాధ్య‌త‌ను బీసీసీఐ తీసుకుంది. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చిన హ‌స్సీ మాత్రం ప‌ది రోజులు ఇండియాలోనే ఉంటాడు.