Begin typing your search above and press return to search.

నేను అంత పెద్ద తప్పేం చేశా: డేవిడ్ వార్నర్

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:15 AM GMT
నేను అంత పెద్ద తప్పేం చేశా: డేవిడ్ వార్నర్
X
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ కు ముందు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరోసారి క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డారు. తన పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించారు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో డేవిడ్ వార్నర్‌ పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

దానితో పాటు... కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం విధించింది. బాట్ టాంపరింగ్ ఘటనలో వార్నర్‌ తో పాటు ఉన్న స్టీవ్ స్మిత్‌‌‌ ను మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకోలేదు. దాంతో అతను మళ్లీ టీమ్ వైస్ కెప్టెన్ అయ్యి.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపిస్తున్నారు.

ఈ విషయంపై వార్నర్ ఫైర్ అయ్యారు. సీఏ విధించిన కెప్టెన్సీ బ్యాన్‌ పై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే, ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌.. కేసును బహిరంగంగా విచారణ చేపట్టాలని నిర్ణయించడంతో వార్నర్‌ ఆ పిటిషన్‌ ను వెనక్కి తీసుకున్నారు. మరిచిపోవాలనుకున్న విషయాలను పదే పదే గుర్తు చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ అయ్యారు.

'నా విషయంలో సీఏ తీరు హాస్యస్పదంగా ఉందన్నారు. తాను గతాన్ని ముగిద్దామనుకుంటే... వారు మాత్రం ఇంకా కొనసాగించాలనే ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బోర్డులో ఒక్కరు కూడా పారదర్శకంగా లేరన్నారు. ఎవరూ జవాబుదారీగా ఉండకూడదని, ఎవరూ నిర్ణయం తీసుకోకూడదనుకొన్నారని వెల్లడించారు. సీఏ పాలనలో స్పష్టంగా నాయకత్వ లోపం కనిపించిందని తెలిపారు. తాను వదిలేద్దామని అనుకున్న ప్రతిసారీ సీఏ పెద్దలు దానిని బయటకు తీస్తూనే ఉన్నారని ఫైర్ అయ్యారు.

ఈ విషయం అంతా తన వ్యక్తి గత ప్రదర్శనపై ప్రభావం చూపిందని అన్నాారు. టెస్టు మ్యాచ్‌ ల సందర్భంగా ప్రతి రోజూ తనకు ఉదయాన్నే లాయర్ల నుంచి ఫోన్లు వచ్చేవన్నారు. అవి తనను బాధకు గురిచేశాయన్నారు. ఇదంతా తనకు అగౌరవంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక డేవిడ్ వార్నర్ సీఏకు వ్యతిరేకంగా మాట్లాడటం హాట్ టాపిగ్ గా మారింది.