అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం.. భారత కుటుంబం బలి

Sat Apr 01 2023 17:26:01 GMT+0530 (India Standard Time)

Attempt to enter America illegally.. Indian family Dead

అమెరికా-కెనడా సరిహద్దుల్లో దారుణం జరిగింది. కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి 8 మంది చనిపోయారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.భారత్ రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు బుధవారం రాత్రి కెనడా నుంచి అమెరికాకు బోటులో అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బోటు సెయింట్ లారెన్స్ నదిలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా చనిపోయారు. ఇప్పటివరకూ 8 మంది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఆరుగురు పెద్దలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

సెయింట్ లారెన్స్ నదీ తీరంలో గల మార్షి ప్రాంతంలో గురువారం మృతదేమాలు కనిపించాయి. ఇది కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతం. బోర్డర్ దాటేందుకు ప్రయత్నించి బోటు మునగడంతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు.

గురువారం ఆరుగురి మృతదేహాలను వెలికితీవారు. తర్వాత మరో రెండు డెడ్ బాడీలు తీశారు. ఓ చిన్నారి వయసు మూడేళ్లు అని.. కెనడా పాస్ పోర్ట్ కూడా వారి వద్ద ఉందని చెప్పారు.

అమెరికా కెనడా మధ్య అక్రమంగా ప్రవేశించే అంశానికి సంబంధించి గతవారం ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.

కానీ కొందరు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇలా భారతీయ రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు ప్రయత్నించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు ఎక్కువ అవుతున్నాయి. గత శీతాకాలంలోనూ అక్రమంగా సరిహధ్దు దాటేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబం మైనస్ 35 డిగ్రీల చలిలో గడ్డకట్టుకుపోయి మరణించడం విషాదం నింపింది. తాజాగా మరో కుటుంబం బలికావడం విషాదం నింపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.