చీరాలలో కలకలం: ఆమంచి ప్రధాన అనుచరుడిపై దాడి.. సీరియస్

Sun Mar 07 2021 10:16:51 GMT+0530 (IST)

Attack on Amanchi's main follower .. Serious

పాతకక్షలు పురివిప్పాయి. కొద్దిరోజులుగా దాడులు ప్రతిదాడులతో సాగుతున్న చీరాల రాజకీయంలో మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిపై భీకర దాడి జరిగింది. ఆ దాడిలో బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడు. పరిస్థితి సీరియస్ గా ఉంది. దీంతో మరోసారి చీరాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రశాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబుపై కాపుకాచి దుండగులు దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన రాంబాబు అపస్మారక స్థితికి వెళ్లిపోయారు.

బాధితుడిని చికిత్స నిమిత్తం చీరాలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి బయలు దేరి వెళ్లారు.

కాగా పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్రణాళిక ప్రకారం సాబినేనిపై దాడి చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.