Begin typing your search above and press return to search.

బీహార్ లో సీఎం కేసీఆర్ పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 March 2023 4:03 PM GMT
బీహార్ లో సీఎం కేసీఆర్ పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా బీహార్ వెళ్లి మరీ కేసీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పై అసద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉన్నాయి.

హైదరాబాద్ ఎంపీ అసద్ తాజాగా బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పేదరికం , వరదలకు గురయ్యే ప్రాంతంగా బీహార్ నిలిచిపోవడానికి పాలకులే కారణమని ఆరోపించారు. "కేసీఆర్‌కు విజన్ ఉందని చెప్పాలి. అతను తన పదవీ కాలంలో విలువైనదేదో చేసాడు "అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి ఆశయాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మోడీకంటే కేసీఆర్ యే ఎక్కువ చేశాడని అన్నాడు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కేసీఆర్‌ సహచరులైన నితీష్‌ కుమార్‌, మమతా బెనర్జీలను కూడా ఒవైసీ ప్రశంసించారు.

"తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం. అయినప్పటికీ ఇది చాలా ఆకట్టుకునే స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిని కలిగి ఉంది. పంపుసెట్ల వినియోగంలో ఇది అత్యున్నత స్థానంలో ఉండేది. ఇది ఇప్పటికీ చేపల పెంపకంలో రెండవ అత్యధిక ఉత్పత్తిదారుగా ఉంది "అని అసద్ అన్నారు.

కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అత్యధిక మెజారిటీని కలిగి ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అడుగుపెట్టడం వల్ల అది సవాలును ఎదుర్కొంటుందని అసద్ అన్నారు. చాలా మంది రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోందన్నారు. "మహారాష్ట్రలో ఏమి జరిగిందో చూస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టుగా తెలుస్తోంది. బీహార్‌లో మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినప్పుడు మరో వైపు చూస్తున్నారని" కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలను కూడా ఒవైసీ నిందించారు.

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. అయితే ఈ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు గత సంవత్సరం ఆర్జేడీలో చేరారు, వారిలో ఒకరు క్యాబినెట్ బెర్త్ కూడా పొందారని అసద్ అన్నారు.

2020లో మహాఘట్‌బంధన్‌తో పొత్తు పెట్టుకోవాలని మేము కోరుకున్నాము, కానీ వారు మమ్మల్ని ఎగతాళి చేశారు... మా పనితీరు అందరూ చూసేలా ఉంది అని ఒవైసీ అన్నారు. కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేశాం. 2025లో 243 మంది బీహార్ అసెంబ్లీలో 50 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులను నిలబెడతామని అసద్ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.