టర్కీకి భారత్ సాయానికి థాంక్స్.. సజీవంగా బయటపడ్డ ఫుట్ బాల్ స్టార్.

Tue Feb 07 2023 21:30:30 GMT+0530 (India Standard Time)

As India rushes help to Turkey

టర్కీ సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పావుగంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 5వేలకు మందికి పైగానే మృతదేహాలను శిథిలాల నుంచి రెస్క్యూ టీంలు వెలికి తీశాయి. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్ లు కూలిపోవడం.. అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలో ఉండడంతో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు కూడా వీల్లేకుండా పోయింది. వేలాది మంది ఇంకా శిథిలాలే కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సిరియాలో ఇంకా మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని సమాచారం.భూకంపంతో కోలుకోలేని విధంగా శవాల దిబ్బలుగా మారిన టర్కీకి భారత్ స్నేహహస్తం అందించింది. కావాల్సిన నిధులు మందులు రెస్క్యూ టీంలను పంపింది. టర్కీకి అవసరమయ్యే వైద్య బృందాలను పంపింది. దీంతో భారత్ లోని రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని ట్వీట్ చేశారు. టర్కిష్ భాషలో హిందీ భాషలో సామెతను ప్రస్తావిస్తూ భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.

భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ స్వయంగా టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ప్రధాని మోడీ సానుబూతిని మానవతా వాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు. అంతేకాదు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలు సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలతోపాటు రిలీఫ్ మెటీరియల్ ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ లు అవసరమైన పరికరాలు సుమారు 100 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూకంపం సంభవించిన ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశమయ్యారు.

టర్కీ సిరియాలో బూకంపంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. వందల సంఖ్యలో భారీ బిల్డింగ్ లు కూలిపోవడం అర్ధరాత్రి కావడంతో గాఢనిద్రలోనే ప్రజలు చనిపోయారు. వేలాది మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఘనా ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియన్ అట్సు కూడా శిథిలాల కింద చిచ్కుకున్నాడు. అట్సు బిల్డింగ్ కూడా భూకంపంలో కూలింది.  అయితే రెస్క్యూ టీం వచ్చి అట్సును శిథిలాల నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అట్సు టర్కీష్ సూపర్ క్లబ్ హట్సేపోర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఘన స్టార్ ఫుట్ బాలర్ భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడడంతో గనా ఊపిరి పీల్చుకుంది. అ


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.