Begin typing your search above and press return to search.
అట్టుడుకుతున్న ఏపీ.. ఎక్కడికక్కడ అరెస్టులు.. రీజనేంటి?
By: Tupaki Desk | 20 March 2023 2:00 PMఏపీ మరోసారి అట్టుడుకుతోంది. గతంలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా అంగన్ వాడి కార్యకర్తలు.. టీడీపీ, వామపక్ష పార్టీల పైనా పడ్డారు. వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీవో 1 ని రద్దు చేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ, వామపక్ష పార్టీలు 'ఛలో విజయవాడ'కు పిలుపునిచ్చాయి.
అదేసమయంలో అంగన్ వాడీలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివస్తున్న వందలాది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్నారు. అంగన్‌వాడీల అరెస్టులను ఖండించిన సీపీఎం... వారి ఆందోళనకు మద్దతు ప్రకటించింది.
పెత్తందారుల పై యుద్ధం అంటూ పేద మహిళ అంగన్‌వాడీల పై ప్రభుత్వం యుద్ధం చేస్తోందని కమ్యూనిస్టు నేతలు ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ అంగన్‌వాడీల డిమాండ్లపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాలని, సీఎం తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని బాబురావు అన్నారు.
మరోవైపు.. టీడీపీ, వామపక్షాల నేతలను ఎవరినీ విజయవాడ వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఛలో అసెంబ్లీకి అంగన్వాడీల ఛలో విజయవాడ కార్యక్రమాలు భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టారు. వందలాది మందికి ముందుగా నోటీసులు పంపించారు. పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కీలక నేతలను గృహ నిర్బంధాలు కూడా చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.