Begin typing your search above and press return to search.

అరెస్ట్ వారెంట్ : పుతిన్ ను అరెస్ట్ చేసే దమ్ముందా?

By:  Tupaki Desk   |   18 March 2023 5:00 PM GMT
అరెస్ట్ వారెంట్ : పుతిన్ ను అరెస్ట్ చేసే దమ్ముందా?
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్ చేసుందుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. రష్యాలోని ఆక్రమిత ప్రాంతాల్లో పిల్లలను అక్రమ మార్గంలో డిపోర్టు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఐసీసీ ఆదేశాల ప్రకారం ఆయన ఏదేని సభ్య దేశంలో అడుగుపెడితే వెంటనే అతనిని అరెస్టు చేస్తామని ప్రాసిక్యూటర్ కరమ్ ఖాన్ తెలిపారు. క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలున్నాయి. వారెంట్ ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారఫడి ఉంటుందని ఐసీసీ ప్రెసిడెంట్ పియోటర్ హాఫ్ మన్ స్కీ తెలిపారు. ఈ నేపథ్యంలో పుతిన్ అరెస్టుకు ఆయా దేశాలు సహకరిస్తాయా? అనే చర్చ సాగుతోంది.

ఉక్రెయిన్ లోని పౌరులపై రష్యా దాడులు, ఆక్రమిత ప్రాంతాల్లో క్రమ బద్ధంగా హింసించడం, దాడి చేయడం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన రష్యాపై ఐక్యారాజ్యసమితి మద్దతుగల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ లోని మారియుపోల్ లోని ఓ థియేటర్ పై రష్యా చేసిన వైమానికి దాడితో  లోపలున్న వందలాది మంది చనిపోయారు. దీంతో మానవ హక్కుల నివేదిక ఇది అత్యంత అసాధారణమైన క్రూర చర్యగా భావించింది. ఇక మైనర్లను చట్టవిరుద్ధంగా బహిష్కరించడంతో పాటు ఉక్రెయిన్ దేశం నుంచి రష్యాకు ఫెడరేషన్ కు చట్టవిరుద్ధంగా ప్రజలను తరలించడం వంటి చర్యలకు పుతిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అంతర్జాతీయ న్యాయస్థానం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

పుతిన్  పై జారీ అయిన అరెస్ట్ వారెంట్ పై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దేశ పిల్లలను బలవంతంగా బదిలీ చేయడంపై పుతిన్ పై తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయంగాచే చేసిన నేరాలకు అంతర్జాతీయంగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాగా పుతిన్ తో పాటు ల్వోవా బెలోవాలకు అరెస్ట్ జారీ అవడంపై అభినందిస్తున్నానని అయన అన్నారు.

రష్యా అధ్యక్షుడిపై వచ్చిన అరెస్ట్ వారెంట్ పై ఆ దేశస్తులు భగ్గుమంటున్నారు. ఈ వారెంట్  టాయిలెట్ పేపర్ తో సమానమని రష్యా అధ్యక్ష భవనం క్లెమిన్ ప్రకటించింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసే అరెస్ట్ వారెంట్కు విలువ లేదని, రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ వారెంట్ జారీ చేయాలన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయం చట్టబద్ధం కాదని అంటున్నారు.మరోవైపు ఆయన తన సభ్య దేశంలో అడుగుపెడితే అరెస్టు చేస్తామని ఐసీసీ ప్రతినిధులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఆ దేశాల సహకారం కావాలని చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన సభ్య దేశాలు పుతిన్ అరెస్టుకు సహకరిస్తాయా? అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే తన సభ్య దేశం అనుకున్న ఉక్రెయిన్ రష్యా వ్యతిరేక కార్యకలాపాలు చేసిందని ఆ దేశంతో యుద్ధం కొనసాగిస్తోంది. అలాంటప్పుడు సభ్య దేశాలు పుతిన్ ను అరెస్టు చేసే ధైర్యం చేస్తాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.