వార్నింగ్: వ్యాక్సిన్ తీసుకోకుంటే అరెస్ట్ తప్పదు

Thu Jun 24 2021 05:00:01 GMT+0530 (IST)

Arrest is mandatory if not vaccinated

కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదు. వ్యాక్సిన్ వేసుకుందామంటే సరిపడా లేవు. దీంతో డిమాండ్ తగ్గ సరఫరా చేయలేక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.అయితే అమెరికా లాంటి దేశాల్లో వ్యాక్సిన్లు వేసుకోమన్నా ప్రజలు అపోహలతో వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.  మరికొన్ని దేశాల్లో వ్యాక్సిన్ విషయంలో  కఠినంగా అమలు చేస్తున్నాయి.ఫిలిఫిన్స్ దేశంలో వ్యాక్సిన్ విషయంలో ఆ దేశ అధ్యక్షుడు కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఆ దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా ఇచ్చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని.. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే అరెస్ట్ లు తప్పవని ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరించాడు.

వ్యాక్సిన్ లు వేసుకోకుండా అరెస్ట్ ల వరకు తెచ్చుకోవద్దని తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని దేశ అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరికలు జారీ చేశారు.ఒకవేళ ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేకుంటే దేశం విడిచి వెళ్లిపోవాలని అధ్యక్షుడు రోడ్రిగో హెచ్చరించారు. అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.