నువ్వేం చేశావ్.. అంటే నువ్వేం చేశావ్.. అరె అసలు ఎవరేం చేశారో చెప్పండి బ్రో!!

Fri Sep 30 2022 14:52:04 GMT+0530 (India Standard Time)

Arre, tell me who did what they did bro!!

ఏపీలో బీజేపీ-వైసీపీ.. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. విశాఖను పాలనా రాజధానిగా మారుస్తా మని..ఇక్కడ ఎంతో అభివృద్ది చేశామని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే.. ఇదేసమయంలో బీజేపీ నాయకులు దీనికి కౌంటర్లు ఇస్తున్నారు. విశాఖలో అసలు ఏం చేశారో.. చెప్పండి.. అంటూ.. బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న రుషికొండను తవ్వేస్తున్నారని అంటున్నారు.విశాఖలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. బీజేపీ నేతలు వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. విజ యసాయిరెడ్డి దోచేస్తున్నారని.. నేరుగా విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో వైసీపీ నాయకులు కూడా.. బీజేపీ నేతలపైవిరుచుకుపడుతున్నారు.

స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తున్నారని.. పోర్టు కార్యకలాపా లను ముందుకు సాగనివ్వడం లేదని.. విశాఖ అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు విశాఖ రైల్వే జోన్‌పైనా విమర్శలు చేస్తున్నారు.

విశాఖ రైల్వే జోన్ ఇస్తారో లేదో.. చెప్పడం లేదని.. వైసీపీ నాయకులు బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఇలా.. నువ్వు ఏం చేశావ్.. అంటే.. నువ్వు ఏం చేశావ్.. అంటూ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కట్ చేస్తే.. ప్రజలు ఏమంటున్నారంటే.. అసలు మీరిద్దరూ..

వైజాగ్ అభివృద్ధికి ఏం చేశారో చెప్పండర్రా? అని కామెంట్లు చేస్తున్నారు. విశాఖ ప్రజల ఓట్లు కావాలి..కానీ ఇక్కడ అభివృద్ధికి మీరు చేసింది చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపక్కన పెట్టి.. కనీసం ఇప్పటికైనా.. విభజన హామీల్లో ఉన్నవాటిని నెరవేర్చేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు. మరి నాయకులు ఏం చెబుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.