Begin typing your search above and press return to search.

'కురుప్' గుర్తుకొచ్చేలా ఆ ఆర్మీ అధికారి రూ.125 కోట్ల మోసం..

By:  Tupaki Desk   |   16 Jan 2022 8:03 AM GMT
కురుప్ గుర్తుకొచ్చేలా ఆ ఆర్మీ అధికారి రూ.125 కోట్ల మోసం..
X
ఆర్మీ అన్నా.. అందులో పని చేసే వారన్నా ఎంతో గౌరవం.. మరెంతో మర్యాదగా చూస్తుండటం తెలిసిందే. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. నేటికి నీతికి.. నిజాయితీకి.. కమిట్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఆర్మీను అభివర్ణిస్తుంటారు. అలాంటి రంగానికి చెందిన ఒక అధికారి చేసిన మోసం నోట మాట రానంత భారీగా ఉండటం విశేషం. నకిలీ టెండర్లను క్రియేట్ చేసి.. రూ.125 కోట్ల మోసానికి పాల్పడిన ఈ అధికారి తీరు చూసినప్పుడు.. ఈ మధ్యనే విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకున్న ‘కురుప్’ మూవీ గుర్తుకు రాక మానదు.

కేరళ రాష్ట్రంలో క్రిమినల్ సుకుమార కురుప్పు జీవితకథ ఆధారంగా నిర్మించిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ తన నటనతో అదరగొట్టేశాడు. కేరళలో హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ప మాదిరి.. ఆర్మీలోనూ మోసాలు చేయొచ్చన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి ఫ్రూవ్ చేసింది. తాజా మోసంలోకి వెళితే..

ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిప్యూటీ కమాండెంట్ గా పని చేస్తున్నాడు. 2012లో ఆర్మీలో చేరిన ఇతను గత ఏడాది డిప్యూటేషన్ మీద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కన్ స్ట్రక్షన్ విభాగంలో విధులు నిర్వహించేవాడు. ఇతడికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుపెట్టటం ఒక అలవాటు. తనకున్నఆస్తి మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో తగలపెట్టేసిన ఇతను.. భారీగా అప్పుల పాలయ్యాడు. అవెంత ఎక్కువగా మారాయంటే.. తాను మోసం చేసిన రూ.125 కోట్లలో రూ.50 కోట్లుకేవలం చేసిన అప్పుల్ని తీర్చటానికే ఖర్చు చేయటం గమనార్హం.

పీకల్లోతుఅప్పుల్లో కూరుకుపోయిన అతను.. వాటి నుంచి బయటపడేందుకు వీలుగా ఒక భారీ ప్లాన్ వేశాడు.ఎస్ఎన్ జీకి పలు నిర్మాణాలుచేపట్టాలని నకిలీ టెండర్లు పిలిచాడు. లావాదేవీలుజరపటం కోసం ఎన్ఎస్ జీ పేరు మీద మానేసర్ లో నకిలీ బ్యాంక్ ఖాతాను తెరిచాడు. టెండర్ల కోసం కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తాల్ని ఆ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించేవాడు.

అలా రూ.125కోట్ల మేర దోచేసిన ఇతడు.. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ వేశాడు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్కు అంతా పూర్తి చేశాడు. అయితే.. తాము డబ్బులు చెల్లించి రెండునెలలు అవుతున్నా.. కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలు బయటకు రాకపోవటం.. దాని సమాచారం ఏమీ అందకపోవటంతో వారు తమకుతెలిసిన వారిని సంప్రదించారు.

దీంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ మోసాన్ని గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఎస్ జీలో పని చేసే తన సోదరి సాయంతో ఈ భారీ మోసాన్ని చేసినట్లు గుర్తించారు. మోసం చేసి కొట్టేసిన రూ.125 కోట్లలో దాదాపు రూ.50 కోట్లను అప్పులు చెల్లించేందుకు ఖర్చుచేసినట్లుగా అధికారులు తేల్చారు. ప్రవీణ్ ఉదంతాన్ని చూస్తే.. కురుప్ మూవీలో కూరుప్ పాత్రధారి మాదిరే.. ఆర్మీ పేరును అడ్డుపెట్టుకొని మోసం చేశాడని చెప్పక తప్పదు.