Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోమ్ వల్ల బరువు పెరుగుతున్నారా? వీటి గురించి తెలుసుకోండి..!

By:  Tupaki Desk   |   20 Feb 2021 11:30 PM GMT
వర్క్  ఫ్రం హోమ్ వల్ల బరువు పెరుగుతున్నారా? వీటి గురించి తెలుసుకోండి..!
X
కరోనా వైరస్ మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత మానవ జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు ఆఫీసులకి వెళ్లి పని చేయాల్సిన భాద తప్పింది. హాయిగా ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే , ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉండటం తో ఇదే ఇప్పుడు చాలామందికి అతి పెద్ద సమస్యగా మారిపోయింది.

ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అనేకమంది బరువు పెరుగుతున్నారు. ఇంట్లోనే వర్క్ చేస్తూ ఉండటం తో ఖాళీగా ఉండే సమయాల్లో ఇష్టం వచ్చిన ఫుడ్ ను పరిమితికి మించి తీసుకుంటుండటం తో ఈ పరిస్థితి వస్తుంది. దీనితో పెరిగిన బరువు తగ్గించుకోవడానికి జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఇది నేటి ఉద్యోగుల పరిస్థితి. అయితే ఈ సమస్యకు వైద్య నిపుణులు చక్కటి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇవి పాటిస్తే చాలు అధిక బరువు నుంచి తప్పించుకోవచ్చు.

అవేంటో ఇప్పుడు చూద్దాం... శారీరక శ్రమ లేకపోతే బరువు పెరగడంతో పాటు జీవనశైలికి సంబంధించిన వ్యాధులైన బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడే అవకాశం లేకపోలేదు. ఇంటి నుండి పని చేసేప్పుడు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఓ సమయం నిర్ధారించుకుని కేవలం అప్పుడు మాత్రమే ఆహారం తీసుకోండి.

ముఖ్యంగా ఏం చేయాలో ఊసుపోక, బోర్‌ కొట్టి తినే అలవాటు మానుకోవాలి. ఆఫీసు పని కానీ, టీవీలు, ఫోనులు చూస్తూ తింటే ఎక్కువగా భోంచేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు తినే సమయాల్లో వాటికీ వీలైనంత దూరంగా ఉండండి. అలాగే పండ్లు, గింజలు లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ తప్ప బిస్కెట్స్‌, వేయించిన చిరుతిళ్ళు, స్వీట్స్‌ ను అస్సలు ముట్టుకోకండి.

పిల్లలకు కూడా పాలు, పండ్లు, మొలకెత్తిన ఉడికించిన గింజలతో చేసిన చాట్‌, ఆమ్లెట్‌, సూప్స్‌ స్నాక్స్‌ గా ఇవ్వాలి తప్ప జంక్‌ ఫుడ్స్‌ ఇవ్వకూడదు. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు క్యాలోరీలు కూడా తగ్గించకపోతే నెమ్మదిగా బరువు పెరుగుతారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసేప్పుడు ఆఫీసు ప్రయాణాలు తగ్గుతాయి. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇలా చేసి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి.