Begin typing your search above and press return to search.

వైసీపీ.. టీడీపీ నేతలకు టికెట్ ఆప్షన్లు ఇప్పుడిన్నా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 AM GMT
వైసీపీ.. టీడీపీ నేతలకు టికెట్ ఆప్షన్లు ఇప్పుడిన్నా?
X
మారిన పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. కీలక పార్టీలకు సంబంధించిన నేతల్లో ఒకలాంటి కంగారు ఉండేది. తమకు పార్టీ టికెట్ కేటాయిస్తుందా? లేదా? అన్న సందేహం వెంటాడుతూ ఉంటుంది.

అలాంటిది ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అధికార వైసీపీలోనే కాదు విపక్ష టీడీపీలోనూ టికెట్ విషయంపై పలువురు నేతలు భేఫికర్ అన్నట్లుగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

గతంలో ఆప్షన్లు చాలా పరిమితంగా ఉండేవి. 2019 విషయానికే వస్తే.. అయితే వైసీపీ లేదంటే తెలుగుదేశం పార్టీ తప్పించి.. మిగిలిన పార్టీలైన జనసేన, కాంగ్రెస్ లాంటి వాటికి సంబంధించి టికెట్ల కోసం ఆరాటం పెద్దగా ఉన్నది లేదు. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి.

ఇప్పటివరకు వినిపిస్తున్న అంచనాల ప్రకారం.. అధికారపక్షమైన వైసీపీ మాత్రమే ఒంటరిగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక విపక్షమైన టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా టీడీపీ - జనసేన మధ్య పొత్తుతోనే ఎన్నికల బరిలోకి రానున్నారు. బీజేపీ సైతం వారితో కలవటమే మంచిదన్న అభిప్రాయంలో ఉంది.

ఇప్పటికైతే పరిస్థితులు అనుకున్నంత దగ్గరకు ఆ మూడు పార్టీలు రానప్పటికీ.. భవిష్యత్తు ముఖచిత్రాన్ని చూసినప్పుడు మాత్రం బీజేపీ కూడా జనసేతతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే.. టికెట్లు లభించని ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో అయితే.. బీఎస్పీ నుంచి కానీ ఎస్పీ నుంచి కానీ ఇదేమీ కాకుంటే..

కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎటు ఉండనే ఉందన్న మాట వినిపిస్తోంది. ఆ పార్టీ వారైతే తాము టికెట్లు ఇచ్చిన వారికి అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా అందించే వీలుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. పార్టీ నుంచి టికెట్ రాని పక్షంలో చలో హైదరాబాద్ అనేస్తే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. టికెట్ల కోసం గతంలో మాదిరి అర్రులు జాజాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.