ఏపీ తెలంగాణలో ఇప్పుడు `గూగుల్ ట్రెండింగ్` నాయకులు వీళ్లేనా?

Sun May 16 2021 16:00:01 GMT+0530 (IST)

Are there any Google Trending leaders in AP and Telangana now

ఏపీలో గూగుల్ ట్రెండింగ్లో ఉన్న నాయకులు ఎవరు? ఎవరెవరు .. దూకుడుగా.. వ్యవహరిస్తున్నారు..? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఆది నుంచి ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌లు ముందున్నారు. అయితే.. తాజాగా మాత్రం వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామరాజు మంచి ట్రెండింగ్‌లో వచ్చేయడం గమనార్హం. ఎందుకంటే.. గడిచిన రెండు రోజులుగా.. ఎంపీ రఘును అరెస్టు చేయడం... ఆయన పుట్టిన రోజు నాడే జగన్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారంటూ.. వచ్చిన కామెంట్లు తెలిసిందే.ఈ క్రమంలో గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్.. ఐటంగా రఘురామ రాజే నిలుస్తుండడం గమనార్హం. నిజానికి వైసీపీ టికెట్‌పై తొలిసారి విజయం దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్.. తర్వాత పార్టీపైనా.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక స్వపక్షంలోనే విపక్షంగా ఉన్న రఘురామను టీడీపీ అను కూల మీడియా భారీ ఎత్తున కవర్ చేసింది. ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టు నేతలు సైతం ఎంపీకి అండగా నిలి చారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా సహా సోషల్ మీడియాల్లో రఘురామకు సానుకూల కవరేజ్ భారీ ఎత్తున సాగుతోంది.

ఒక్క వైసీపీ వాట్సాప్ గ్రూపులో మాత్రమే రఘుకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. వీటినే వారు షేర్ చే స్తున్నారు. అంటే.. దీనిని బట్టి.. రఘురామ అంటే ఎవరో తెలియని వారికి కూడా ఇప్పుడు ఆయన తెలిసి పోయారు. అలాగే తెలంగాణలో మొదట రేవంత్‌రె్డ్డి.. బండి సంజయ్ హరీష్ రావు.. కేటీఆర్‌లు ట్రెండిం గ్‌తో ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన మాజీ మంత్రి.. ఈటల రాజేందర్ కూడా ట్రెండింగ్ అయ్యారు.

కేసీఆర్.. వ్యూహాత్మకంగా.. వ్యవహరించడం.. బర్తరఫ్ చేయడం వంటివి.. అనంత రం.. జరిగే పరిణామాలు ఆయన రాజీనామా చేస్తారా? రిజైన్ చేస్తే.. ఆయన గెలుస్తాడా? అతని మీద ఎవరు పోటీ చేస్తారు? అతను ఈ మధ్య కాంగ్రెస్ బీజేపీ నేతలను ఎందుకు కలిశారు.. ఇలాంటి వార్తలు విషయాలపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఈటల ఏపీలో రఘురామరాజు భారీ ఎత్తున ట్రెండింగ్‌లో ఉన్నారు.