రఘురామ ఇంట్లో జగన్ ఫ్యాన్స్ ఉన్నారా !

Wed Jul 06 2022 09:19:27 GMT+0530 (India Standard Time)

Are there Jagan fans in Raghurama's house?

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విల్లాలో జరిగిన వ్యవహారం సంచలనంగా మారింది. తాను ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని అని చెబుతున్నా వినకుండా బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళి కొట్టారంటూ కానిస్టేబుల్ ఫరూక్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో అనుమానంగా ఉన్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని ఆరాతీసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని ఎంపీ రఘురాజు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరి వెర్షన్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.కానిస్టేబుల్ వాదనకు బలంచేకూరేట్లుగా కొన్ని వీడియో క్లిప్పుంగులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది+సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి కానిస్టేబుల్ ను కిందపడేసి దౌర్జన్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతనిని బలవంతంగా కారులోకి ఎక్కించిన దృశ్యాలు కూడా వీడియోల్లో కనబడుతున్నాయి.  రోడ్డుమీద బహిరంగంగానే ఇంతచేసిన వాళ్ళు ఇక ఇంట్లో మర్యాదగా వ్యవహరిస్తారా ?

ఇక్కడే ఎంపీ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందంటున్నారు. ఎలాగంటే ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత కూడా సదరు కానిస్టేబుల్ పై బాగా దురుసుగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్లో కనబడుతున్నాయి. కాబట్టి కానిస్టేబుల్ ఆరోపిస్తున్నట్లే తనపై ఇంట్లో బాగా కొట్టినట్లు అర్ధమవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇపుడీ విషయమే ఎంపీ ఆయన కొడుకు భరత్ పీఏ శాస్త్రి భద్రతా సిబ్బంది మెడకు చుట్టుకోబోతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డుపై ఫరూక్ పై దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలను చాలామంది వీడియోలు తీసే అవకాశముంది కాబట్టి వైరలయ్యాయి.

అయితే ఇంట్లో జరిగిన విషయాన్ని ఎవరు చిత్రీకరించి బయటకు వదిలారు ? ఎంపీ ఇంట్లో పూర్తిగా ఆయన మనషులు నమ్మకస్తులే కదా ఉంటారు. అయినా ఇంట్లో కానిస్టేబుల్ తో దురుసుగా వ్యవహరించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.

అంటే ఎంపీ ఇంట్లోనే ఆయనకు వ్యతిరేకంగా ఎవరో ఉన్నారన్న విషయం తెలిసిపోతోంది. తీసిన వీడియోలు బయటకు వెళితే ఎంపీతో పాటు తామంతా కేసుల్లో ఇరుక్కుంటామన్న విషయం తెలియకుండానే బయటకు వదిలుంటారా ?