అమ్మాయిల అలవాట్లు ఉంటే అబ్బాయిలు ‘గే’లేనా?

Thu Aug 11 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Are boys gay if they have the habits of girls

హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో నివసించే ఆర్వే మల్హోత్రా (17) అనే పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అతడు అమ్మాయిల అలవాట్లు కలిగి ఉండడమే దీనికి కారణం. స్కూల్లో ఆర్వేను అందరూ అమ్మాయి అంటూ వేధించడం.. కొందరు లైంగిక వేధింపులకు పాల్పడడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ తన చావుకు స్కూల్ టీచర్లు కారణమంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక నోట్ రాశాడు.పోలీసుల విచారణలో ఆర్వే గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఆర్వేకు అమ్మాయిల అలవాట్లు ఉన్నాయి. ఆర్వేకు గోళ్లకు రంగులు వేసుకోవడం అంటే ఎంతో ఇష్టమని.. టాప్స్ వేసుకోవడం.. నగలు ధరించడాన్ని కూడా చాలా ఇష్టపడేవాడు. అయితే స్కూల్లో ఇలా అమ్మాయిలా తయారవుతున్న ఆర్వేను స్కూల్ యాజమాన్యం టీచర్లు అడ్డు చెప్పారు. స్కూల్ లో ఆడపిల్లల్లా ప్రవర్తించకూడదని ఆర్వేకు చెప్పారు. అబ్బాయిలు ఇలా నెయిల్ పెయింట్ వేసుకొని వస్తే ఇక అమ్మాయిలకు ఎలా వద్దని చెబుతామని టీచర్లు అనేవారంటూ ఆర్తి వెల్లడించారు.

ఆర్వేకు సింగిల్ మదర్ మాత్రమే ఉంది. కొడుకును కోల్పోయిన ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆర్వేకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ఆర్వే ‘గే’ అంటూ స్కూల్లో వేధించేవారు. ఆర్వే జెండర్ ఐడెంటిటీ గురించి చెబుతూ గేలిచేసేవారు. ఇంట్లో వంటపనులు చేసేవాడు. టీ పెట్టి ఇచ్చేవాడు. టిఫిన్ తయారు చేసేవాడు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు అంటూ ఆయన తల్లి తన కొడుకు గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

జెండర్ విషయంలో వేధింపులే ఆర్వే మరణానికి కారణంగా చెప్పేశారు. అవమానించారని నా దగ్గర బాధపడేవాడు. నేను గే అని చాలా మంది అంటున్నారని.. అది నిజమేనా? అని వాపోయేవాడు. తన మీద తనకే అనుమానం కలిగేలా చేశారని.. తన ఐడెంటిటీ గురించి వాడిలో ఆందోళన పెరగడానికి కారణం స్కూల్ యాజమాన్యం అని చెప్పేవాడని ఆ తల్లి వాపోయింది. ఎదుగుతున్న పిల్లాడు ప్రాణాలు పోవడానికి ఆ మాటలే కారణమని తెలిపాడు.

యుక్త వయసులో ఇలా జెండర్ ఐడెంటిటీ సమస్యతో పోరాడుతున్న పిల్లల మానసికస్థితిని వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు అర్థం చేసుకోవాలి. కౌమార దశలో చాలా మంది పిల్లలు జెండర్ ఐడెంటిటీతో పోరాడుతుంటారు. ఈ గందరగోళం చాలా కాలంగా ఉంటుంది. ఇలాంటి పిల్లలకు సలహాలు ఇచ్చేవారుండరు. అదే వారి మరణానికి కారణంగా తెలుస్తోంది.