Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ప‌రువు తీస్తున్నారా? మేధావుల మాట ఇదే!

By:  Tupaki Desk   |   24 Nov 2021 1:30 AM GMT
అసెంబ్లీ ప‌రువు తీస్తున్నారా?  మేధావుల మాట ఇదే!
X
``ఏదైనా క్లిష్ట‌మైన స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. ప్ర‌భుత్వంలో ఉన్న వారు ఎంత పెద్ద వారైనా.. ప్ర‌తిప‌క్ష నేత ల స‌ల‌హాల‌ను తీసుకునేవారు. ఉదాహ‌ర‌ణ‌కు.. పార్ల‌మెంటులో భూప‌రిమితి చ‌ట్టం చేయాల్సి వ‌చ్చిన‌ప్పు డు.. ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా.. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరా గాంధీ సైతం.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో చ‌ర్చిం చారు. అప్ప‌టి రాజ్య‌స‌భ స‌భ్యులు.. పుచ్చ‌ల ప‌ల్లి సుంద‌ర‌య్య వంటివారి నుంచి కూడా స‌ల‌హాలు స్వీక రించారు.

ఇక‌, ఏపీలోనూ.. తమ అజెండాల‌నే అమ‌లు చేసుకోవాల్సి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు.. ఎప్పుడై నా వ్య‌తిరేకించిన సంద‌ర్భంలో ఆయా పార్టీల నేత‌ల‌తో కూర్చుని చ‌ర్చించి.. అంద‌రినీ మెప్పించి బిల్లు లు పాస్ చేసుకున్న ప‌రిస్థితి ఉండేది`` అని అప్ప‌టి పార్ల‌మెంటు,, అసెంబ్లీ అంశాల‌ను గుర్తు చేసుకుంటు న్నారు మేధావులు.

ఎందుకంటే.. వారు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టే.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో ఎలాంటి చ‌ర్చా ఉండ‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన ఏ విష‌యంపైనా.. అన్ని కోణాల్లోనూ చ‌ర్చ‌సాగ‌డం లేదు. ఏదోబిల్లులు పాస్ చేసుకోవ‌డం కోస‌మే.. అది కూడా ఏదో ఒక వ్యూహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. `దాటించేశాం` అనే ధోర‌ణిలో స‌భ‌లు న‌డుస్తున్నాయ‌ని అంటున్నారు. తాజాగా అసెంబ్లీలో 14 బిల్లుల‌ను పాస్ చేశారు.

వీటిలో కీల‌క‌మైనవి కూడా ఉన్నాయి. అయితే.. ఒక్క‌రంటే.. ఒక్క‌రు కూడా వాటిపై చ‌ర్చించ‌లేదు. ప్ర‌తిప‌క్షం ఎలాగూ లేదు కాబ‌ట్టి.. అధికార ప‌క్షంలోనూ చ‌ర్చించే `ధైర్యం` ఎవ‌రూ చేయ‌లేక పోయారు. కేవ‌లం తమ అజెండా సాగిపోతే.. చాల‌నే ధోర‌ణిలో ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

వాస్త‌వానికి ఈ ప‌రిస్థితి ఒక్క ఏపీ అసెంబ్లీలోనే కాదు.. పార్ల‌మెంటులోనూ క‌నిపిస్తోంది. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై క‌నీసం చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శిస్తూనే ఉన్నారు. అయిన‌ప్పటికీ.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు.

ఇక‌, రైతుల నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న‌లు, వ‌చ్చే ఆరు మాసాల్లో ఎన్నిక‌లు.. కార‌ణంగా.. త‌మ‌కు దెబ్బ‌త‌గ‌ల‌కుండా చూసుకునేందుకు.. ప్ర‌భుత్వం వాటిని వెన‌క్కి తీసుకుంది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితులు. దేశంలో గ‌తంలో చాలా అరుదుగా జ‌రిగేవ‌ని.. కానీ.. ఇప్పుడు.. త‌ర‌చుగా జ‌రుగుతున్నాయ‌ని మేధావులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అత్యంత విలువైన ప్ర‌జాధ‌నం వృధా కావ‌డంతోపాటు.. ప్ర‌జాప్ర‌తినిధుల విలువైన స‌మ‌యం కూడా ఇలాంటి వాటివ‌ల్ల వృథా అవుతోంద‌ని.. చెబుతున్నారు. ఇప్ప‌టికైనా ఇలాంటి చ‌ర్య‌లు మానుకోవాల‌ని సూచిస్తున్నారు.

ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే ప్ర‌జాస్వామ్యానికి, ప్ర‌భుత్వాల‌కు.. చ‌ట్ట స‌భ‌ల‌కు గీటురాయిగా మారాల‌ని.. అలా కాన‌ప్పుడు.. ఎంత మంద‌బ‌లం ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. చెబుతున్నారు. ప్ర‌జ‌లు అంద‌రినీ.. అన్నింటినీ గ‌మ‌నిస్తున్నార‌న్న విష‌యాన్ని పాల‌కులు ఎవ‌రైనా గుర్తించాల్సిందేన‌ని.. చెబుతున్నారు. మ‌రి మ‌న పాల‌కులు మార‌తారా? లేదా? చూడాలి.