Begin typing your search above and press return to search.

ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్..వారందరికీ రేపు రూ. 5 వేలు!

By:  Tupaki Desk   |   25 May 2020 10:10 AM GMT
ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్..వారందరికీ రేపు రూ. 5 వేలు!
X
రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిచెందడం..ఆ తర్వాత దాన్ని అరికట్టడానికి లౌక్‌ డౌన్ విధించడంతో మతపరమైన సంస్థలు అన్నీ మూతపడ్డాయి. పెద్ద ఆలయాలు - ఇతర మతపరమైన ప్రార్థనా సంస్థల్లో రోజువారి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయి. ఇక, చాలా మంది ఉపాధిపై లాక్‌ డౌన్ ఎఫెక్ట్ పడింది. దీంతో, మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆలయాలు - మసీదులు - చర్చీల్లో కార్యక్రమాలు చేస్తున్నవారికి ఆర్థిక సాయం ప్రకటించింది.

వారందరికీ రూ.5 వేలు ఆర్థిక సాయం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అర్చకులు - ఇమామ్ - మౌజమ్స్ - పాస్టర్‌ లకు ఈ ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రేపు అనగా మే 26 వ తేదీన వారందరికీ రూ . 5 వేల చొప్పున సాయం చేయనుంది. లాక్ డౌన్ ద్వారా వీరందరూ ఇబ్బంది పడ్డారని గుర్తించిన ప్రభుత్వం ..వీరి ఖాతాల్లోకి రేపు డబ్బు జమ చేయనుంది. వీరిలో 34 వేలమంది అర్చకులు ..30 వేలమంది పాస్టర్ లు ..అలాగే 14 వేలమంది ఇమామ్ - మౌజమ్స్ ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ వేతనం పొందుతున్నవారికి ఈ పథకం వర్తించదని ఇప్పటికే స్పష్టం చేసారు.