జేసీకి మరోసారి షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్ ...4 వాహనాలు సీజ్ !

Tue Jun 02 2020 20:30:59 GMT+0530 (IST)

Ap Sarkar giving shock to JC once again ... 4 Vehicles Siege!

టీడీపీ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలను మరోసారి సీజ్ చేశారు ఏపీ రవాణా శాఖ అధికారులు. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో.. వెహికల్స్‌ని సీజ్ చేశారు అధికారులు. వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు.గతంలో జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్స్ కు సంబంధించిన 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు. తాజాగా నేడు 4 టిప్పర్లను సీజ్ చేశారు. మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామన్న డీటీసీ శివరామప్రసాద్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయనే కారణంగానే అధికారులు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన అనేక బస్సులు టిప్పర్లను సీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై జేసీ దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.