Begin typing your search above and press return to search.

బాబు.. చినబాబుకు ‘హైదరాబాద్’ షాక్ తగలనుందా?

By:  Tupaki Desk   |   12 Jan 2021 4:20 AM GMT
బాబు.. చినబాబుకు ‘హైదరాబాద్’ షాక్ తగలనుందా?
X
రాజకీయాల్లో అడ్డ బ్యాటింగ్ అస్సలు సరికాదు. కొట్టే షాట్ ఏదైనా సరే.. నాలుగు బంతులు తేడా పడినా ఫర్లేదు.. కొడితే ఫోర్.. లేదంటే సిక్సు కొట్టాలి. అంతేకానీ.. సింగిల్స్ తో ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరిగ్గా అదే పని చేస్తున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సమయం.. సందర్భం.. ప్రజల మూడ్ అన్నిచూసుకొని ఆయన నోటి నుంచి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

కరోనా నేపథ్యంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఆయన కుమారుడు కమ్ ఎమ్మెల్సీ లోకేశ్ ఇద్దరు ఏపీలోని అమరావతిలో ఉండకుండా.. హైదరాబాద్ లోనే ఉండిపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. లాక్ డౌన్ టైంలో హైదరాబాద్ లో ఉండిపోయిన బాబు.. చినబాబులు సమయం చూసుకొని ఏపీకి వచ్చి పోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీ విపక్ష నేత రాష్ట్రంలో ఉండకుండా అదే పనిగా తెలంగాణలో ఉంటున్నారన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేస్తున్నారు.

రాష్ట్రంలో ఉండకుండా.. అక్కడెక్కడో హైదరాబాద్ లో కూర్చొని ప్రజల రక్షణకు ఏమాత్రం అవకాశంలేని స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని కోరటాన్ని తప్పు పట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్ని నిర్వహిస్తామని బాబు కోవర్టులు నోటిఫికేషన్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉండిపోవటాన్ని సీఎం జగన్ ప్రస్తావిస్తున్న వేళ.. బాబు.. చినబాబులు తమ తీరును మార్చుకోవాలన్న సందేశాన్ని ఇచ్చినట్లైంది. మరిప్పటికైనా తండ్రి..కొడుకులు ఇద్దరు తమ తీరును మార్చుకుంటారా?