Begin typing your search above and press return to search.
కండీషన్స్ అప్లై.. వైఎస్ అవినాష్ కు ముందస్తు బెయిల్!
By: Tupaki Desk | 31 May 2023 11:57 AMదివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి.. తెలంగాణ హైకోర్టు లో ఊరట దక్కింది. ఈ కేసు లో ఆయన కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ పై మే 31న తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఆయన కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.
వివేకా హత్య కేసు లో అవినాష్ ను ఇరికించడానికి ప్రయత్నం జరుగుతోందన్న ఆయన తరఫు లాయర్ల వాదనల తో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి ని కస్టడీ లోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదుల కు స్పష్టం చేసింది.
ఈ కేసు లో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్ అనేక మలుపులు తిరిగింది. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అవినాష్ రెడ్డి కి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్ పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు కు సూచించింది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలను కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విన్నది. రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు సాగాయి. ఇక చివరకు మే 31న అవినాష్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేసింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎనిమిదో సారి మే 16న విచారణకు రావాలని మే 15 నోటీసు లు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. తనకు ముందస్తు పనులు ఉన్నాయని.. అందువల్ల హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. దీంతో మే 19న విచారణ కు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్ హాజరు కాలేదు. దీంతో మే 22వ తేదీన విచారణ కు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసినా రాలేదు. దీంతో అవినాశ్ అరెస్టు తప్పదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు అవినాష్ తల్లి చికిత్స పొందుతున్న కర్నూలు లోని విశ్వభారతి ఆస్పత్రి సమీపంలోనే మకాం వేయడంతో హీట్ పెరిగింది. ఏ క్షణంలో అయినా అవినాశ్ అరెస్టు తప్పదనే సర్వత్రా వినిపించింది. అయితే ఎట్టకేలకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. మే 31 తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు మే 27న ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ క్రమంలో అవినాశ్ కు కోర్టు పలు షరతులు విధించింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. సాక్షుల ను ప్రభావితం చేయొద్దని సూచించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తున కు సహకరించాలని అవినాష్ కు హైకోర్టు సూచించింది. ఇప్పటికే అవినాష్ కు అరెస్టు చేసినట్లయితే రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని వెల్లడించింది.
కాగా అవినాష్ కు బెయిల్ రావడంతో వైసీపీ శిబిరంలో ఆనందం మిన్నంటగా.. టీడీపీ శిబిరంలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. వివేకా హత్య కేసు లో అవినాశ్ ను అరెస్టు చేస్తారని టీడీపీ పెద్ద ఆశలే పెట్టుకుందని అంటున్నారు. అవినాష్ ను అరెస్టు చేశాక సీఎం జగన్, ఆయన భార్య భారతిలను కూడా విచారించాలని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియా మాధ్యమాల్లో ఇదే దిశగా కథనాలు ప్రసారమయ్యాయి.
అయితే.. డామిట్.. కథ అడ్డం తిరిగినట్టు టీడీపీ ఆశించినట్టు జరగకపోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. అవినాష్ కు బెయిల్ రావడంతో ఆ పార్టీలో నిరాశానిశ్పృహలు అలుముకున్నాయి. టీడీపీ అనుకూల మీడియాలో తల్లి అనారోగ్యం పేరిట అవినాష్ డ్రామాలు ఆడుతున్నారని కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. సీబీఐ ఎందుకు అరెస్టు చేయలేకపోతుందంటూ దాని వ్యవహారశైలి ని తప్పుబడుతూ కూడా కథనాలు రాశారు. అయితే అవినాశ్ కు బెయిల్ రావడంతో టీడీపీ, దాని అనుకూల మీడియా కు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయిందని అంటున్నారు.