Begin typing your search above and press return to search.

అమిత్ షాకు విశాఖ ఉక్కు సెగ

By:  Tupaki Desk   |   9 Jun 2023 10:34 PM GMT
అమిత్ షాకు  విశాఖ ఉక్కు  సెగ
X
రాక రాక విశాఖ వస్తున్నారు కేంద్రం లో నంబర్ టూ బీజేపీ లో నంబర్ వన్ అయిన అమిత్ షా. ఆయన విశాఖ టూర్ దద్దరిల్లిపోయేలా ఉండాల ని ఏపీ బీజేపీ ప్లాన్ చేస్తోంది. యాభై వేల కు తగ్గకుండా జనాల తో సమీకరణ చేస్తోంది. విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెడుతోంది. ఇప్పటికి నాలుగేళ్ళ క్రితం ఇదే గ్రౌండ్స్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. సో ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయి అమిత్ షా సభ సక్సెస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది.

ఎంతో వ్యయ ప్రయాసల కు ఓర్చి బీజేపీ అమిత్ షా సభను సక్సెస్ చేయల ని చూస్తోంది. స్వాగత సత్కారాలు అదిరిపోయే రేంజి లో ఉండాలని తాపత్రయపడుతోంది. అయితే మీకు ఆ శ్రమ అక్కరలేదు, మేము వేరే లెవెల్ లో గ్రాండ్ గా అమిత్ షాకు ఘన స్వాగతమే పలుకుతామని విశాఖ ఉక్కు కార్మికులు ఒట్టేసుకుని కూర్చున్నారు. అమిత్ షా విశాఖ లో బీజేపీ విజయోత్సవ సభలో కాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు ముందు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

గత రెండున్నరేళ్ళుగా విశాఖ లో కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టకుండా బీజేపీ ప్రభుత్వం ఉందని, లాభాల బాట లో ఉన్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమాని కి ఈ నెల 11తో 850 రోజులు అవుతోంది. దాంతో ఈ నెల 10 11 తేదీల లో విశాఖ లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విశాఖ ఉక్కు పవర్ ఏంటో అమిత్ షాకు చూపించాలని చూస్తున్నారు.

విశాఖ లోనూ విశాఖ ఉక్కు కర్మాగారం గేట్ వద్ద పెద్ద ఎత్తున ఉక్కు ఉద్యోగులు, కార్మికు లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి చూస్తున్నారు. అమిత్ షా కంట్లో పడాల ని ట్రై చేస్తున్నారు. ఏదో విధంగా అమిత్ షా కు విశాఖ ఉక్కు సెగ తగిలేలా చూస్తున్నారు. మరో వైపు విశాఖ కు అమిత్ షా రాక సందర్భంగా సీపీఐ సీపీఎం పార్టీలు కూడా ఆందోళనలు నిర్హైస్తున్నారు

ఏపీ కి బీజేపీ గత తొమ్మిదేళ్ళ లో తీరని అన్యాయం చేసిందని, విభజన హామీలు ఏవీ ఈ రోజుకీ అమలు చేయలేదని, ప్రత్యేక హోదా ను కూడా అటకెక్కించారని, బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.

బీజేపీ విశాఖ లో బీజేపీ విజయోత్సవాల ను నిర్వహించడం కాదు విద్రోహ సభను జరుపుకోవాల ని వామపక్షాలు అంటున్నాయి. తాము అమిత్ షా రాకకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అంటున్నాయి. మొత్తానికి చూస్తే అమిత్ షా విశాఖ లో పార్టీని బలోపేతం చేయడానికి ఏపీలో జనాలను బీజేపీ విజయ సందేశాన్ని మోడీ తొమ్మిదేళ్ళ పాల ను వివరించడానికి వస్తొంటే ఆయన కు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ చాలా గట్టిగా తగిలేలా ఉంది అంటున్నారు.

అమిత్ షా విశాఖ విజయోత్సవ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏమైనా మాట్లాడుతారా తన ప్రైవేటీకరణ పాలసీ గురించి సమర్ధించుకుంటారా లేక ఆ విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ గొప్ప పాలన చేసిదని చెప్పేసి ఊరుకుంటారా అన్నది చూడాలి. చాలా కాలానికి బీజేపీ పెద్ద లీడర్ విశాఖ కు రావడం తో రాజకీయ సందడి మామూలుగ లేదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.