చోక్సీ గర్ల్ ఫ్రెండ్ నోరు విప్పింది.. ఏం చెప్పిందో తెలిస్తే అవాక్కే

Wed Jun 09 2021 10:00:27 GMT+0530 (IST)

Another twist on the arrest in Choksi

బ్యాంకుల వద్ద వేలాది కోట్లు రుణాలుగా తీసుకొని బిస్కెట్ వేసి.. విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ వ్యవహారం ఇప్పుడో వార్తాంశంగా మారింది. గర్ల్ ప్రెండ్ తో డిన్నర్ కు వెళ్లేందుకు పక్క దేశానికి వెళ్లి అడ్డంగా బుక్ కావటమే కాదు.. ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటున్న వైనం తెలిసిందే. తనను ట్రాప్ చేసిందని గర్ల్ ప్రెండ్ పై నిప్పులు చెరుగుతున్నాడు. ఇంతకీ చోక్సీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? బ్యాంకులకే టోపీ పెట్టినోడిని భలేగా బుక్ చేసిందే అన్న సందేహానికి సమాధానం తాజాగా వచ్చేసింది.దీనికి కారణం చోక్సీ గర్ల్ ప్రెండ్ మీడియా ముందుకు వచ్చేసింది. ఆమె చెప్పిన విషయాలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. బ్యాంకుల్నే కాదు.. గర్ల్ ప్రెండ్ ను కూడా బురుడీ కొట్టేసిన ఇతగాడి పైన ఆమె స్వీట్ రివేంజ్ తీర్చుకుందా? అన్న సందేహాం కలిగేలా ఆమె మాటలు ఉన్నాయి. చోక్సీ గర్ల్ ప్రెండ్ పేరు బార్బరా జరాబికా. చోక్సీ తనతో స్నేహం చేశాడని.. తనను వల్లో వేసుకునే ప్రయత్నం చేశాడని చెప్పింది.

అయితే.. తనకు అన్ని అబద్ధాలే చెప్పాడన్నది ఆమె ఆరోపణ. చోక్సీ తన పేరును రాజ్ గా పరిచయం చేసుకున్నట్లుగా ఆమె చెప్పింది. స్నేహం పేరుతో వలలో వేసుకునే ప్రయత్నం చేశాడని పేర్కొంది. తన సన్నిహిత్యాన్ని కోరుకున్నాడని.. తానంటే ఇష్టమని చెప్పాడని చెప్పింది.

‘‘నాకు ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడు. వజ్రపుటుంగరాలు.. బ్రేస్ లెట్ లు ఇచ్చాడు. అవన్నీ నకిలీవే. ఇద్దరం కలిసి వ్యాపారం చేయాలని ఒక ఒప్పందానికి కూడా వచ్చాం. ఆఫీస్ కు పిలిచి.. బలవంతంగా ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నించాడు.దాంతో మా ఇద్దరికి గొడవైంది’’ అని పేర్కొంది. అతన్ని పోలీసులు పట్టుకోవటంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అమె మాటల్ని వింటుంటే..  టచ్ చేయకూడని అమ్మాయిని టచ్ చేసి చోక్సీ అడ్డంగా బుక్ అయ్యాడని అనిపించట్లేదు?