Begin typing your search above and press return to search.

అమెరికాలో కీలక బాధ్యత స్వీకరించిన మరో భారత సంతతి వ్యక్తి !

By:  Tupaki Desk   |   15 Oct 2021 9:35 AM GMT
అమెరికాలో కీలక బాధ్యత స్వీకరించిన మరో భారత సంతతి వ్యక్తి !
X
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో భారత సంతంతికి చెందిన వారి ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారతీయులు పలు కీలక పదవులను చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో మరో భారతసంతతికి చెందిన వ్యక్తి వచ్చి చేరారు.

అగ్రరాజ్యమైన అమెరికా లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత సంతతి వ్యక్తులకు మంచి పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు. భారత సంతతి వ్యక్తులకు బైడెన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బైడెన్ వ్యక్తిగత సలహాదారుల్లో ఒకరు భారత సంతతి వ్యక్తి ఉన్నారు. ఇక తాజాగా మరో భారత సంతత వ్యక్తి పేరును ఓ కీలక పదవికి ప్రతిపాదించాడు బైడెన్.

గతంలో అమెరికా వాయుసేనలో పనిచేసిన రవి చౌదరి అనే వ్యక్తి పెంటగాన్‌ లోని ‘ఎయిర్‌ ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌ స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాకు అర్హుడని జో బైడెన్‌ తెలిపారు. రవి చౌదరి గతంలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ ఏఏ)లో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌ గా పనిచేశారు. 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీ-17 యుద్ధ విమాన పైలట్‌ అయిన రవి.. అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌ లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఇక బైడెన్ ప్రతిపాదనను సెనేట్ ఒకే చేస్తే రవి చౌదరి ఎయిర్‌ ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌ స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమితులవుతారు.