10 లక్షల మంది తీర్పు.. 3 కోట్ల మంది నాడేనా...!

Sat Mar 18 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

AndhraPradesh MLC Result

ప్రస్తుతం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం.. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చింది. కడప-అనంతపురము-కర్నూలు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం సహా.. ఉత్తరాంధ్ర పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజ కవర్గం(కడప-అనంతపురం-కర్నూల్) ఎమ్మెల్సీ స్థానంలోనూ.. టీడీపీ విజయం దక్కించుకుంది. అంటే.. మొత్తంగా.. పట్టభద్రులు.. వైసీపీకి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చారనే వాదన వినిపిస్తోంది.ఇక దీనిపైనే వైసీపీ నేతలు మరోవిశ్లేషణ చేస్తున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందినవారు 10 లక్షల మంది పైచిలుకు ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది ఉన్నా రు. అయితే.. ఒక్క ఉత్తరాంధ్రలో మినహా.. మిగిలిన రెండు చోట్ల కూడా.. వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. అంటే.. పది లక్షల మంది ఓట్లలోనూ.. 49 శాతం మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారనేది నేతల మాట.

అంతేకాదు.. ప్రస్తుతం 10 లక్షల మంది తమకు అనుకూలంగా ఉన్నారంటూ.. టీడీపీ చేస్తున్న ప్రచారం పైనా వైసీపీ నేతలు మరో విశ్లేషణ చేస్తున్నారు. 10 లక్షల మంది రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు ప్రతినిధులా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. వీరు వోటేసినంత మాత్రాన.. 3.5 కోట్ల మంది ఓటేసినట్టే నా? అని కూడా అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఉండే యాస్పిరేషన్లు వేరేగా ఉంటాయని.. సో.. దీనికి సార్వత్రిక ఎన్నికలకు ముడిపెట్టలేమని అంటున్నారు.

అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు బాగానే పనిచేస్తాయని.. తమకు నమ్మకం ఉందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. దీనిని అంతర్మథనం చేసుకుని.. వచ్చే ఎన్నికలకు అవసరమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారు. మరి ఏం చేస్తారోచూడాలి. ఇప్పటికైతే.. వైసీపీ లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.