Begin typing your search above and press return to search.

అదానీ ప్రదేశ్ : ఏపీ అంటే ఏమనుకుంటున్నారు...?

By:  Tupaki Desk   |   16 Aug 2022 12:30 PM GMT
అదానీ ప్రదేశ్ : ఏపీ అంటే ఏమనుకుంటున్నారు...?
X
ఏపీ అంటే ఏమనుకుంటున్నారు. ఫుల్ ఫార్మ్ లో ఆంధ్ర ప్రదేశ్ అనే కదా. కాదు అదానీ ప్రదేశ్ అని రాసుకోవాలి. అవును నిజమే. మీరు విన్నది నిజమే. చూస్తున్నదీ నిజమే. ఏపీ అంటే అదానీదేనా అని ఎర్రన్నలు గుర్రుగా మాట్లాడవచ్చు, విపక్షాలు విమర్శించవచ్చు. కానీ ఏపీ అంటే ఆదానీదే అని అధికారికంగా కూడా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అవును ఏపీ వైపు ఆదానీ చూస్తున్నారు.

ఆయన అడుగులు ఈ వైపుగా వడివడిగా పడుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. ఇన్నాళ్ళూ ఆదానీ అంబానీ అని వారి పేర్లను మాత్రమే విన్నామని, వారి సంస్థలు ఇపుడు ఏపీలో రాబోతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖలో త్వరలో అదానీ డేటా సెంటర్ ఓపెన్ అవుతుందని ఆయన అన్నారు. అలాగే అనేక పరిశ్రమల ఏర్పాటునకు కూడా అదానీ, అంబానీల సహకారం ఏపీకి ఉంటుందని జగన్ ప్రకటించారు.

ఇక గత మూడేళ్ళలో ఎంతో అభివృద్ధి చేశాం, పరిశ్రమలు తెచ్చాం, ఇంకా తేబోతున్నాం, ఏపీ కేరాఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని జగన్ చెప్పారు. గత మూడేళ్ళలో వరసగా అవార్డులు కూడా ఈ కేటగిరీలో ఏపీకి వచ్చాయని అన్నారు. విశాఖ టూర్ లో జగన్ ఈసారి అదానీ, అంబానీల ప్రస్థావన తేవడం విశేషం. వైసీపీ ఏలుబడిలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

ఏపీ వైపు బిగ్ షాట్స్ చూస్తున్నారు, ఇది శుభ పరిణామం అని జగన్ చెప్పడం వెనక బిజినెస్ స్ట్రాటజీ ఉందనే అంటున్నారు. అయితే ఏపీలోని కీలక పోర్టులను అదానీ వంటి వారికి కట్టబెట్టారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అలాగే పెట్టుబడివర్గాలకే పెద్ద పీట వేస్తున్నారు అని కూడా అంటున్నారు. అదానీ ప్రదేశ్ అని తాము ఎపుడో చెప్పామని ఇపుడు అదే ప్రభుత్వం కూడా అంటోందని విమర్శిస్తున్నారు.

ఏపీలో అదానీ అంబానీల పెట్టుబడులు ఎన్ని అన్నది కూడా తెలపాలని డిమాండూ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కేంద్రాన్ని అదానీలు, అంబానీలు నడిపిస్తున్నారు అన్న విమర్శలు ఎటూ ఉన్నాయి. ఇఉడు ఏపీ విషయంలోనూ అదే జరుగుతోంది అని అంటున్నారు. మరి అదానీ అంబానీల పేరిట ప్రభుత్వం చేసుకునే ప్రచారం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది చూడాల్సిందే.